ఈ69న్యూస్ పాలకుర్తి ఆగస్టు 30 జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో భాజపా మండల అధ్యక్షులు మారం రవికుమార్ ఆద్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి పై అనుచిత వాక్యాలు చేసిన రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు దొంగరి మహేందర్ మాట్లాడుతూ..దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పతనాన్ని తట్టుకోలేక రోజు రోజుకు బిజెపి చెందుతున్న అభివృద్ది నీజీర్ణించుకోలేక నరేంద్ర మోడీ తల్లిపై ,నరేంద్ర మోడీ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని పద్ధతి మార్చుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దుంపల సంపత్,జిల్లా నాయకులు కమ్మగాని శ్రీకాంత్ నియోజక వర్గ సోషల్ మీడియా నాయకులు రాంరావు,మండల ప్రధాన కార్యదర్శులు పెనుగొండ సోమేశ్వర్,వేల్పుల దేవరాజు,పట్టణ అధ్యక్షుడు పబ్బా సంతోష్,శ్రీనివాస్,కుమార్ తదితరులు పాల్గొన్నారు .