అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం పామిడి మండలం పామిడి పట్టణ హైవేలో ఉన్నటువంటి పంజాబీ డాబా ఓనర్ తేజేంద్రనాథ్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా టిసి ప్రభుత్వ పాఠశాల లో చదువుతున్న 200 మంది విద్యార్థినీ విద్యర్థులకు పరీక్షకు రాయడానికి అవసరమైన అట్టలు మరియు పెన్నులు ఆయన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు ఇవ్వడం జరిగినది ఈ రోజుల్లో చాలామంది పుట్టినరోజులు అంటే పార్టీలు పబ్బులని డబ్బులు వృధాగా ఖర్చు చేస్తుంటారు కానీ దానికి భిన్నంగా తేజేంద్రనాథ్ సింగ్ చదువుకునే విద్యార్థులకు అట్టలు పెన్నులు ఇచ్చి తన పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు ఇలాగే ప్రతి ఒక్కరు పుట్టినరోజు, వేడుకలకు డబ్బు వృధా చేయకుండా పేద విద్యార్థులకు చదువుకు అవసరమైన పుస్తకాలు గానీపుస్తకాలు గానీ అవసరమైన దుస్తులు గాని ఇచ్చి వారి భవిష్యత్తుకు మంచి చేయలి అని ఆయన కోరారు టి సి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు అట్టలు పెన్నులు ఇచ్చిన తేజేంద్రనాథ్ సింగ్ కు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే రామ్ కుమార్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే రామ్ కుమార్ మరియు బోధన సిబ్బంది పాల్గొనడం జరిగిందిి