
హిమ్మత్ నగర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మంగు జయప్రకాశ్
హిమ్మత్ నగర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మంగు జయప్రకాశ్
ఈ69 న్యూస్ జఫర్ఘడ్
ఆకాశంలో సగం అవకాశాల్లోనూ మహిళలు సగం ఉండేలా చైతన్యం కావాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హిమ్మత్ నగర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మంగు జయప్రకాశ్ అన్నారు.మండలంలోని హిమ్మత్ నగర్ ఉన్నత పాఠశాలలో సోమవారం మహిళా దినోత్సవం మరియు సావిత్రీ బాయి ఫూలే వర్ధంతిని పురస్కరించుకుని పాఠశాల మహిళా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బందిని సర్వీస్ పర్సన్ ను మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ కుక్,హెల్పర్లను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మంగు జయప్రకాశ్ మాట్లాడారు.మానవజాతి ప్రగతికి పురోగమనానికి మహిళా సాధికారత స్వావలంబన మాత్రమే దారి చూపుతుందని అన్నారు.పురుషుల కంటే మిన్నగా అన్ని రకాల వృత్తుల్లో ఉద్యోగాల్లో మహిళలు మెరుగ్గా రాణిస్తున్నారని చైతన్య వంతమైన మహిళలు ఉంటే ఇల్లు,కుటుంబం సమాజంలో నాణ్యమైన మార్పు సాధ్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గాదె వెంకట స్వామి వెంగల జితేందర్ పీడీ భూక్యా వంశీకృష్ణ విద్యార్థులు పాల్గొన్నారు.