
ఏప్రిల్ 11నుండి14
పూలే అంబెడ్కర్ జన జాతర సభలు
ఏప్రిల్ నెలను మహానీయుల మాసంగా పాటించండి
కేవీపీఎస్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
టి స్కైలాబ్ బాబు
నేటి ఆధునిక యుగంలో కూడా గ్రామ సీమల్లో కులవివక్ష అంటరానితనం ప్రత్యక్షంగా, పట్టణాల్లో పరోక్షంగా కొనసాగుతుందని కులవివక్ష పై ఏప్రిల్ నెలలో జరుగు ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు మంగళవారం ఇబ్రహీంపట్నం పాషానరహరి స్మారక భవన్ లో కేవీపీఎస్ రంగారెడ్డి జిల్లా స్థాయి సమావేశం జరిగింది కేవీపీఎస్ జిల్లా అధ్యక్షలు బోడ సామెల్ అధ్యక్షత జరిగింది.
ముఖ్యఅతిథిగా హాజరైన కేవీపీఎస్ రాష్ట్ర ప్రదాన టి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ
నేటికి దళితులకు గుడి ప్రవేశం లేని గ్రామాలు, బతుకమ్మ ఆడనీయని గ్రామాలు, క్షవరం చేయకపోవడం,దసరా పండుగ సందర్భంగా జమ్మి ఆకు తెంపారని దాడి, హోటళ్ళలో రెండు గ్లాసుల పద్ధతి, పాఠశాలల్లో దళితులు మధ్యాహ్న భోజనం వంట చేస్తే విద్యార్థులు తినకపోవడం రచ్చబండ మీద కూర్చొనియ్యకపోవడం వంటి కులవివక్ష రూపాలు కొనసాగున్నాయని చెప్పారు పట్టణాల్లో దళితులకు ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదన్నారు ఇంకా అనేక రూపాల్లో కుల వివక్ష అంటరానితనం కొనసాగుతుందన్నారు వీటన్నిటిని పారద్రోలటానికి ఉన్న చట్టాలు జీవోలు రాజ్యాంగబద్ధమైన హక్కులను పాలకవర్గాలు అమలు చేయడంలేదన్నారు ఈ వివక్ష రూపాలపై ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలు నిర్మించాలన్నారు ఏప్రిల్ నెల మొత్తాన్ని మహనీయుల మాసంగా కేవీపీఎస్ ప్రకటించి పూలే అంబేద్కర్ జన జాతరలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు కుల వివక్ష అంటరానితనం ఎక్కడ కొనసాగితే అక్కడ ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటం నిర్మించాలన్నారు కులవివక్ష అంటరానితనాన్ని సమూలంగా నిర్మూలనకు కేవీపీఎస్ సన్నద్ధం అవుతుందన్నారు
కులవివక్ష అంటరానితనం కుల దురహంకారహత్యలు సాంఘిక బహిష్కరణలు జోగిని వ్యవస్థ ఇలాంటి వాటిని పారద్రోలటానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, రాజ్యాంగ హక్కులు, చట్టాలు అమలుకోసం ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు..సామాజిక ఉద్యమ ప్రతిఘటన పోరాటాలను సామూహికంగా పౌర సమాజం కూడా బలపరచాలని ఆయన కోరారు ఏప్రిల్ ఒకటి నుండి పది వరకు క్షేత్రస్థాయిలో గ్రామీణ కుల వివక్ష పై సర్వే నిర్వహిస్తామని 11 నుండి 14 వరకు కూలీ అంబేద్కర్ జయంతి సభలు నిర్వహించి ఏప్రిల్ 15 నుండి 30 వరకు ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలు నిర్మిస్తామన్నారు 1955 పౌర హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారంగా ప్రతి నెల చివరి రోజున పౌర హక్కుల పరిరక్షణ దినం నిర్వహిస్తూ కులయివక్షకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయాలన్నారు జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసుల ప్రకారంగా ప్రతి వారం చివరి రోజున పులియోక్షపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు అధికారులు ప్రజాప్రతినిధులు కుల వివక్ష నిర్మూలనకు కృషి చేయాలని చెప్పారు కుల వివక్ష పై ప్రతిఘటన పోరాటాల్లో అన్ని రాజకీయ పార్టీలు సంఘాలు వ్యక్తులు శక్తులు సహకరించాలన్నారు
ఈ సమావేశంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎం ప్రకాష్ శరత్ జిల్లా ఉపాధ్యక్షులు దుబ్బ చెన్నయ్య ఎం ఆనంద్, ఎర్ర వెంకటేష్ డాక్టర్ బుచ్చయ్య,ఐ భాస్కర్
వీరేష్ వీరేష్ జంగయ్య అశోక్ నరసింహ ఆశీర్వాదం యాదగిరి శ్రీనివాస్ ఆదామ్ సాయి తదితరులు పాల్గొన్నారు.