
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
పెంచిన అధిక ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ (ఎం )మండల నాయకులు నందిపాటి వెంకన్న డిమాండ్ చేశారు. సోమవారం అబ్బాయి పాలెం గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల ను ప్రజలకు వివరించటానికి ఒకటో తారీకు నుండి ఏడో తారీఖు వరకు అఖిలభారత స్థాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముందుగా గ్రామంలో పలు వీధులలో ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాల పాలనలో ప్రజలు వాడుకునే ప్రతి నిత్యవసర వస్తువుల మీద ధరలు పెంచి పేద ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేశారని విమర్శించారు. 2014 బిజెపి అధికారంలోకి రాకముందు గ్యాస్ ధర 400 రూపాయలు ఉన్న గ్యాస్ ధర ఇప్పుడు 1200 రూపాయలకు పెరిగిందని అన్నారు. 50 రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలునేడు 110 రూపాయలకు పెరిగిందని గుర్తు చేశారు. సబ్బు ఉప్పు మనిషి కట్టుకునే బట్టలు నడిపే వాహనము వేసుకునే చెప్పులు ఇలా చెప్పుకుంటూ పోతే సగటు పేదవాని నిత్యవసర వస్తువు ధరను పెంచి మళ్లీ దానిపై జిఎస్టి వసూలు చేయడం సిగ్గు సెట్ అన్నారు. 9 సంవత్సరాల క్రితం 50 వేల కోట్ల రూపాయలతో ధనవంతుడిగా ప్రపంచంలో 638వ స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ ఈ మతోన్మాద బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ కుబేరుల సంఖ్యలో రెండో స్థానానికి ఎలా వచ్చాడనీ ఆయన ప్రశ్నించారు. కరోనా సమయంలో అనేకమంది ఆహారం దొరక్క ఉపాధి లేక జీవనం విధానము అల్లా కొల్లలమైతే ఆ సమయంలో అదాని సంపద 10 రెట్లు ఎక్కువగా పెరిగింది ఎలా పెరిగిందని దుయ్యబట్టారు. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వ పాలనలో పేదలను దోచి కార్పొరేట్ శక్తులకు పెడుతున్న. కేసీఆర్ ప్రభుత్వం ఒక్క మాట మాట్లాడకపోవడం మోదీ పాలనను సమర్ధించినట్లే అవుతుందని అన్నారు. వెంటనే అధిక ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జినక ఎర్ర ఎంకన్న, కొండ ఉప్పలయ్య, జినక సైదులు, జామ్మూర్తి, కొండయ్య, వెంకన్న, పులమ్మ, ఉప్పలమ్మ, మాధవి, వెంకన్న, తదితరులు ఉన్నారు.