
bdrachalam news
విద్యార్థులకు ఉచితంగా బస్సు పాసులు ఇవ్వాలి
నూతన జాతీయ విద్యా విధానం రద్దుకై చలో ఢిల్లీని జయప్రదం చేయండి.
ములకలపల్లి న్యూస్:-ఈనెల 12 వ తారీఖున దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడిని జయప్రదం చేయాలని పెండింగ్లో ఉన్న 7800 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు గార్లపాటి పవన్ కుమార్ అన్నారు.
ఈ సందర్భంగా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 7200 కోట్ల రూపాయల స్కాలర్షిప్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని అన్నారు. గత మూడు సంవత్సరాల నుండి విద్యార్థులకు స్కాలర్షిప్ లేక అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఉచితంగా బస్సు పాసులు ఉచితంగా ఇవ్వాలి అని అన్నారు. నూతన జాతీయ విద్యా విధానం రద్దుకై చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్రను తిప్పి కొట్టేందుకు విద్యార్థులు కదిలి రావాలని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి బోడా అభిమిత్ర మండల నాయకులు వెంకట్ మహేష్ ప్రభాస్ తరుణ్ షణ్ముఖ రవి చిన్న తదితరులు పాల్గొన్నారు.