మోతి నగర్ బోరబండ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రజక వృత్తిదారులకు 250 యూనిట్ల ఫ్రీ కరెంటు ఈ సంవత్సరం జులై, ఆగస్టు ,సెప్టెంబర్ ,పెండింగ్ బిల్లులు సబ్సిడీ ఇవ్వలేదని కరెంట్ కనెక్షన్ ఎర్రగడ్డ నేతాజీ నగర్ లో బిక్షపతి శ్రీనివాసులు మరియు కొంతమంది రజక వృత్తిదారుల కరెంటును కట్ చేయటం జరిగింది వెంటనే పెండింగ్ బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జూబ్లీహిల్స్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో మోతీ నగర్ కరెంట్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఫ్రీ కరెంట్ అని చెప్పి కనెక్షన్ ఇచ్చి ఇప్పుడు ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే కరెంట్ కట్ చేస్తే రజక వృత్తిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. రజక వృత్తిదారులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు ఇచ్చేంతవరకు కరెంటు అధికారులు రజక వృత్తిదారులకు సంబంధించిన ఫ్రీ కరెంట్ కనెక్షన్ ను కట్ చేయకూడదని రజక వృత్తిదారుల సంఘం ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ ,గోపాల్ ,యాదగిరి, రవి ,రాకేష్ సునీల్ తదితరులు పాల్గొన్నారు