
పెండింగ్ లో ఉన్న రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల కు మూడు లక్షల లోను ఇవ్వాలి
జనగామ పట్టణంలోని రెండో విడత బాణాపురం హైదరాబాదు రోడ్డు ఇందిరమ్మ ఇండ్లు2008లో ఇచ్చిరు కానీ అసంపూర్తిగా ఉన్నవి వాటికి డబల్ బెడ్ రూమ్ స్కీం కింద మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని జోగు ప్రకాష్ సిపిఎం పట్టణ కార్యదర్శి అన్నారు. జనగాం పట్టణంలో పార్టీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి బూడిద అంజమ్మ అధ్యక్ష వహించగా జోగు ప్రకాష్ సిపిఎం పట్టణ కార్యదర్శి పాల్గొని మాట్లాడుతూ 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పేరుతో స్థలాలు ఇచ్చింది వాటి ద్వారా సగం సగం ఇల్లు కట్టుకొని డబ్బులు ఎలక అసంపూర్తిగా ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఏడు సంవత్సరాలు అయినా జనగామ పట్టణంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు కాబట్టి స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్లకు డబల్ బెడ్ రూమ్ స్కీం కింద మూడు లక్షల రూపాయలు లోన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకు మౌలిక వసతులు సిసి రోడ్డు డ్రైనేజీ మంచినీరు కరెంటు సౌకర్యాలు కల్పించి ప్రజలను ఆ ఇండ్లలో పంపించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.
—జనగామ పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయాలి నెహ్రూ పార్క్ దగ్గర ఉన్న బ్రిడ్జిని మరమత్తులు చేయాలి అని అన్నారు .ఈ కార్యక్రమంలో టౌన్ సభ్యులు పల్లె లలిత శాఖ కార్యదర్శి చీర రజిత నాయకులు దూసరి నాగరాజు సాంబరాజు ప్రశాంత్ యాదలక్ష్మి సరిత స్వప్న మల్లేష్ కుమార్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు