
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి అబ్బాస్
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి అబ్బాస్
జనగామ: సిపిఎం సీనియర్ నాయకులు కార్మికు ఉద్యమ నేత ధర్మకంచ ఎర్ర సూర్యుడు అమరజీవి కామ్రేడ్ల శ్రీనివాస్ గారి ప్రథమ వర్ధంతి సభ జనగామ జిల్లా కేంద్రంలోని కామాక్షి ఫంక్షన్ హాల్లో అధ్యక్షతన జరిగింది. శ్రీనివాస్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం అబ్బాస్ మాట్లాడుతూ దేశంలో పెట్టుబడిదారీ విధాన ఫలితంగా దేశంలో 80 సంవత్సరాలుగా స్వతంత్ర అనంతరం దేశంలో ఆర్థిక అసమానతలు పేదరికం దారిద్రం పెరిగి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఒకవైపు కార్పొరేషన్ ఆదాయం ఘనంగా లక్షల కోట్లలో పెరుగుతుంటే పేదల ఆదాయం కిందికి పడిపోయి జీవన విధానం చాలా దారుణంగా ఉంది విద్యా వైద్యానికి దూరంగా ఉంటున్నారు అభివృద్ధి నోచుకోవడం లేదు. అభివృద్ధి ఫలాలు పేదలకు అందడం లేదు దేశ సంపదను దోచుకుంటున్న తన సంపదను లాభాలు సాధించుకొని ప్రజలను ఇబ్బంది పాలు చేస్తున్నాం కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ లాంటి పార్టీలు తాత్కాలికంగా సంక్షేమ పథకాలు ఇస్తూ ప్రజలను ఆశల్లో భ్రమల్లో ఉంచుతూ ఆర్థిక అసమానతలేని కమ్యూనిస్టు సమాజ స్థాపన చేయడమే శ్రీనివాస్ కి ఇచ్చి నిజమైన నివాళి అని పార్టీ సభ్యులందరూ శ్రేణులు అందరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి మాట్లాడుతూ జనగామ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న దైనందిన సమస్యలపై నిరంతరం పోరాటాల నిర్వహిస్తూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ జనగామ జిల్లాలో ఇండ్ల స్థలాలు రేషన్ కార్డులు పెన్షన్లు తెగిన రోడ్లను మరమ్మత్తు చేయాలని యూరియా రైతులకు అందించాలని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఉపాధి హామీ కార్మికులకు పెండింగ్ బిల్లులు ఇవ్వాలని విద్యా వైద్యం ఫ్రీగా అందించాలని వృత్తిదారులకు రక్షణ కల్పించాలని అనేక సమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తూ ప్రజల పక్షాన నిలబడుతుంది సిపిఎం సిపిఎం చేసే ప్రజాఉద్యమాలకు ప్రజల సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించాలని నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని యువత సన్మార్గంలో నడిచి దేశ అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వరకు సభ్యులు రాపర్తి రాజు సింగారపు రమేష్ సాంబరాజు యాదగిరి బొట్ల శేఖర్ రెడ్డి హనుమకొండ జిల్లా కార్యదర్శి గాదె ప్రభాకర్ రెడ్డి డాక్టర్ గోపాల్ రెడ్డి జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి జోగు ప్రకాష్ బోడ నరేందర్ పోతునూరు ఉపేందర్ బెల్లంకొండ వెంకటేష్ మునిగల రమేష్ భూక్య చందు నాయక్ శ్రీనివాస్ గిట్ల గణేష్ ఎండి అజారుద్దీన్ గంగాపురం మహేందర్ మాచర్ల సారయ్య దాసగాని సుమ ఏదునూరి మదర్ బాలిన వెంకట మల్లయ్య లలిత తదితరులు పాల్గొన్నారు