
పెద ప్రజల మార్పు కై వస్తున్నా
మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండల కేంద్రంలో లంబాడా హక్కుల పోరాట సమితి అధ్వరం లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా కిసాన్ పరివార్ అధినేత సనావత్ భూపాల్ నాయక్ హాజరు అయ్యారు. కాగా కొందరు లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులు భూపాల్ నాయక్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కాకూడదని గో బ్యాక్ భూపాల్ నాయక్ అనే నినాదాలతో అడ్డుకున్నారు. వారి ఆవేశాన్ని గ్రహించిన భుపాల్ నాయక్ ఎలాంటి గొడవలు వద్దు వెళ్ళిపోతున్నాను అని వెనక్కి వెళ్లారు. వెళుతూ చిన్న గూడూరు మండల కూడలిలో ఉన్న దాశరధి కృష్ణమాచార్యులు, దాశరథి రంగాచార్యుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చానని, తాను సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని భగవంతుడు నాకు అన్ని ఇచ్చారని ప్రజాసేవ చేయడానికి వచ్చాను అని చెప్పారు డోర్నకల్ ప్రజలు మంచివారని ఇక్కడే ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకొని ఇల్లు నిర్మించుకొని ఆధార్ కార్డు కూడా అన్ని ఇక్కడికి మార్చుకున్నాను అని తనను నాన్ లోకల్ అని ప్రచారం చేసే వాళ్ళకి బుద్ధి చెప్తానని అన్నారు గత పాలకులు ఈ ప్రాంత అభివృద్ధిని చేయలేదని ఇక్కడ ఎక్కువగా రైతులు పండించే పంటలకు మిర్చి పత్తి పసుపు సంబంధించిన పంటలకు ఇండస్ట్రీస్ ఏమి తీసుకురాలేకపోయారని ఇప్పటికే ఆరేడు కోట్లు ఖర్చుపెట్టి ప్రజాసేవ చేశారు ఈ ప్రాంత ప్రజలకు యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తానని అన్నారు, గ్రామ అభివృద్ధి కోసం,ప్రజా సేవ కోసమే నేను పరితపిస్తున్నానన్నారు. గ్రామాలలో దోచుకోవ డానికి రాలేదని, సేవ చేయడమే నా దృక్పథం అన్నారు. దేవుడి నాకు అన్ని మంచి చేశాడు, అందులో కొంత ప్రజలకు సేవా చేసేటందుకే వచ్చానని, మీరెంత ఎదురొస్తే నేను అంత ముందుకు వెలుతానన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో దిగితే మొదటగా రాజకీయంగా యువతను చైతన్య పరుస్తానన్నారు. డోర్నక నియోజకవర్గం నుండి ప్రత్యక్షంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు, చిన్న గూడూరు మండలంలో సరైన రోడ్డు సౌకర్యం లేదని,ప్రజల సమస్యలను తెలుసుకొని నా వంతు సహాయంగా పార్టీలతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలను తీర్చడానికి వస్తే,కొందరు పక్క నియోజకవర్గం నుండి వచ్చి అల్లర్లు సృష్టిస్తున్నారని, అల్లర్లకు, భయపడి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను, గిరిజన తండాలను అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో నాకు అవకాశం వస్తే అందరినీ కలుపుకొని దోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి పని చేస్తానన్నారు. చిన్నగూడూరు మండలంలోని గ్రంథాలయానికి 50వేల రూపాయలు చెక్కును, అలాగే గుడి అభివృద్ధి కోసం మరో 50 వేల రూపాయల చెక్కును అందజేశారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తి కావస్తున్న గిరిజన ప్రాంతాలలో అభివృద్ధి ఏమి జరగలేక, ఇంకా సమస్యల వలయంలోనే కొట్టు మిట్టాడుతున్నాయన్నారు. నిస్వార్థంగా ఎలాంటి లాభాపేక్ష ఆలోచించకుండా, ప్రజా సేవ చేయడానికే గ్రామాలలో తిరుగుతున్న తప్ప ప్రజలను దోచుకొని దాచుకోవడానికి గ్రామాలలో తిరగడం లేదన్నారు. కొందరు స్వార్ధపరులు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అయినా వెనకడుగు వేసేదే లేదని ప్రజల సమస్యలను తెలుసుకొని, సాధ్యమైనంత వరకు వాటిని తీర్చే ప్రయత్నం చేస్తానన్నారు. వారి వెంట గాంధీ నాయక్, బాలు నాయక్, శివన్న, మద్దెల సురేష్, జర్రిపోతుల రంగన్న గౌడ్,డి వై గిరి,గిరిజన యువకులు, ఉత్సాహవంతులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.