
telugu galam news e69news local news daily news today news
అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో పాలకుర్తిలో ఇస్లాం ఆర్థిక వ్యవస్థ గూర్చి అవగాహన సదస్సు ముఖ్య అతిధిగా పాల్గొన్న అహ్మదీయ జాతీయ ఆర్ధిక ఉప పర్యవేక్షకులు మౌల్వీ షహాబుద్దీన్ గళం న్యూస్ పాలకుర్తి ప్రపంచంలో పేదరిక నిర్మూళన కేవలం ఇస్లాం యొక్క ఆర్థిక వ్యవస్థ విధానంను అనుసరిస్తేనే సాధ్యమౌతుందని అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ జాతీయ ఆర్థిక ఉప పర్యవేక్షకులు మౌల్వీ ముహమ్మద్ షహాబుద్దీన్ అన్నారు.శనివారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని అహ్మదీయ మస్జిద్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా కు చెందిన వివిధ శాఖల కార్యదర్శులతో ఇస్లాం మరియు ఆర్థిక వ్యవస్థ అనే అంశం పైన అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సుకు వారు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రపంచంలో ఎంతో మంది కూడు,గూడు,గుడ్డ లేక ఇంబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు.ఇస్లాం ధర్మం జకాత్ వ్యవస్థను ఏర్పాటు చేసి పేదరిక నిర్మూలనకు బాటలు వేసిందని తెలిపారు.నేడు అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా జకాత్ వ్యవస్థతో పాటు వివిధ రకాల చందాల వ్యవస్థలను ఏర్పాటు చేసి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తుందని తెలిపారు.దైవ మార్గంలో చందాలు ఇవ్వడం వలన ధన వృద్ది కలుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు లతీఫ్ షరీఫ్,ఉపాధ్యక్షులు సలీం,కోశాధికారి యాకూబ్ పాష,వివాహ సంబంధాల శాఖ కార్యదర్శి ఖాజా మియా,నూరుద్దీన్,ముజీబ్,యాకూబ్ పాష,ఖాజా,వివిధ గ్రామాల మౌల్వీలు మస్తాన్,వలీ,అస్ఘర్,అయ్యూబ్,ఫకీర్,యాకూబ్ పాష,నూరుద్దీన్,ముస్తఫా,తదితరులు పాల్గొన్నారు.