పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ళు కేటాయించాలి.
Hyderabad
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.అబ్బాస్ డిమాండ్
సిపియం హైదరాబాద్ సౌత్ కమిటీ ఆధ్వర్యంలో చాంద్రాయణగుట్టలోని ఈ.డబ్ల్యూ.ఎస్ కాలనీ, గౌస్ నగర్ లో సిపియం పార్టీ గా డబుల్ బెడ్ రూం, స్థానిక సమస్యలపై పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా సిపియం హైదరాబాద్ సౌత్ కార్యదర్శి ఎండి. అబ్బాస్ మాట్లాడుతూ హైదరాబాద్ నడి బొడ్డున్న ఉన్న ఆభివృద్ధికి నోచుకోని గౌస్ నగర్, ఈ. డబ్ల్యూ. ఎస్ కాలనీ అని దువ్వబట్టారు. ఈ ప్రాంతంలో నీరూ పేదలు కొన్ని సంవత్సరాలుగా నివసిస్తున్న ప్రజాప్రతినిధులు,ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ కాలనీ లో చాలా మందికి ఇండ్ల సౌకర్యం లేక, కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మాత్రం డబుల్ బెడ్ రూం లు పేదలకు,ఇండ్లు లేని వారికి ఇస్తానని ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. పైగా ఇండ్లు ఉన్నవారికి మళ్ళీ ఇండ్లను కేటాయిస్తున్నారు. నిజమైన లబ్ది దారులకు మాత్రం ఇండ్లు రాని పరిస్థితి ఉంది. కావున కచ్చితంగా అక్కడ నివసిస్తున్న పెదాలని గుర్తించి డబుల్ ఇండ్లలో ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. లేని పక్షంలో పేదలు ఇండ్లలోకి ప్రవేశం చేస్తారు అని హెచ్చరించారు. చివరి అవకాశం ప్రభుత్వ అధికారులకి ఇస్తున్నాము అన్నారు. వెంటనే లబ్ది దారులకు గుర్తించి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని అన్నారు. గౌస్ నగర్ లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లలో స్థానికులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. విట్ఠల్ గారు,మాట్లాడుతూ ఇండ్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 28నా జరిగే కలెక్టర్ ఆపీస్ ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని పేద ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు విఠల్, నాగేశ్వరరావు, కోటయ్య, మీనా, జిల్లా కమిటీ సభ్యులు లక్మమ్మ, సత్తార్ ,బాబార్ ఖాన్,జంగయ్య, లతీఫ్, బాలు, కృష్ణ, కిషన్, స్వామి, జీవన్, ఫర్జాన, అష్మా, టిప్పు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.