
telugu galam news e69news local news daily news today news
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కాసర్ల పహాడ్ గ్రామంలో అహ్మదియ్య ముస్లిం మహిళల ఆధ్వర్యంలో నిరు పేదలకు, వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.ఇవి గ్రామ మహిళా,ఉపాధ్యక్షురాలు ఖైరున్నిసా,ఆస్మా,రజియా చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు షేక్ హుస్సేన్ సాహెబ్ మరియు జిల్లా ఇంఛార్జి ముహమ్మద్ అక్బర్ పాల్గొన్నారు.వారు మాట్లాడుతూ అహ్మదియ్య ముస్లిం జమాత్ దైవ ప్రసన్నత కొరకు మరియు మానవతా దృక్పథంతో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళా అధ్యక్షురాలు నూర్జహాన్,యాకూబీ, రిజ్వానా,మెహరున్నిసా, ఆస్మా,తస్లీం,గ్రామ సదర్ సాహెబ్ షేక్ దస్తగీర్ సాహెబ్,మోల్వి రంజాన్ సాహెబ్,రజాక్ పాషా,జాని సాహెబ్,మదార్ హుస్సేన్, జలాలుద్దిన్,అహ్మద్,హమీద్ బుడాన తదితరులు పాల్గొన్నారు.