
కోదాడ మండల పరిదిలోని గుడిబండ గ్రామంలో గురువారం కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి ఈ సందర్భంగా ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి మాట్లాడుతూ సబ్బండ వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా బడుగు బలహీన వర్గాలకు అండగా నేనున్నా అంటూ అన్నిరకాలుగా అండదండలు అందిస్తూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తూ పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించేలా ముందుచూపుతో పరిపాలన చేస్తూ ఆర్ధిక సమస్యలతో సతమతమవుతూ కంటిచూపు కోల్పోయిన వారికి,దృష్టిలోపం ఉన్నవారికి భరోసా కల్పించడానికి అలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి చేపట్టిన బృహత్తర కార్యక్రమమే కంటివెలుగు కార్యక్రమమని ఇట్టి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి ప్రభుత్వ నిర్దేశిత లక్ష్య సాధనకు కృషి చేయాలని నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నేతృత్వంలో ప్రతీ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేయాలని ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు అందుబాటులో ఉండి కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలంతా ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మల్లెల రాణి బ్రహ్మయ్య,సర్పంచ్ లంకెల అలివేలు మంగమ్మ,జిల్లా వైద్యులు డాక్టర్ కళ్యాణ చక్రవర్తి,ఎంపీడీఓ విజయశ్రీ,ఎంపీఓ తుమ్మల నాగేశ్వరరావు,గ్రామశాఖ అధ్యక్షులు మహమ్మద్ సలీం, వార్డు సభ్యులు శేషు, సురేష్,శ్రీనివాస రెడ్డి, బిక్షం, అధికారులు,ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.