
పేదల పక్షపాతి సిఎం కేసిఆర్
నిరు పేదల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా
చెన్నకేశవపురం, కరివిరాల గ్రామాలకు చెందిన 46 లబ్ధిదారులకు కరివిరాల రైతు వేదిక నందు ప్రభుత్వ స్థలాల్లో పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాలను పంపిణి చేశారు. అనంతరం అయన మాట్లాడుతూ మునుపెన్నడూ లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలు ప్రతి నిరుపేదకు అందించామని ఆయన అన్నారు. గూడు లేని వారు ఎన్నోఏండ్ల నుండి అభద్రతా భావంతో ఉంటున్నా ప్రజల కల ఈ రోజు నెరవేరిందన్నారు. మీ కల ను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే అన్నారు. ఇక్కడ నివసిస్తున్న పేదలకు ఇండ్ల పట్టాలు మంజూరు చేసే అవకాశం తనకు కలగడం సంతోషంగా ఉందన్నారు. పేదవాళ్లు ఎన్నో ఏళ్లుగా ఏ హక్కు లేకుండా జీవించడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలుసుకున్న మఖ్యమంత్రి ఇళ్ళ పట్టాలను శ్రీకారం చూట్టారని తెలిపారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. పేదలకు సొంత నివాసాల పేరుతో ఇళ్ళు నిర్మించి, వారి పై బ్యాంకు ల్లో అప్పులు మోపిన చరిత్ర గత పాలకులది అయితే, 4000 కోట్లు మాఫీ చేసి రుణ విముక్తులను చేసిన ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వం లోని బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలకు మహిళలు,పేదలే కేంద్రబిందువు అన్నారు.. మహిళలు,పేదలు బాగుంటేనే తెలంగాణ సార్థకమైనట్లు అని నమ్మే నాయకుడు కేసీఆర్ అన్నారు.ఇళ్ళ పట్టాలు అందుకున్న ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరి ఆశీర్వాదం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి సూర్యనారాయణ, ఎంపీపీ యాతకుల జ్యోతి మధుబాబు, పిఎసిఎస్ చైర్మన్లు గోసుల రాజేష్, పుట్టా రమేష్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.