
ఖమ్మం ఉమ్మడి జిల్లాలో సుమారు 8 లక్షల మందికి పైగా సహాయ సహకారాలు అందించిన ఆపద్బాంధవుడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిపై కారు కూతలు కూస్తే సహించేది లేదని పొంగులేటి వర్గ నేతలు గోపిశెట్టి వెంకటేశ్వర్లు, గణేశుల రవి, తుమ్మలపల్లి రమేష్, గొడుగునూరి లచ్చిరెడ్డి, ఎర్రి నర్సింహారావు, మాగంటి శ్రీను హెచ్చరించారు. శుక్రవారం రాత్రి తల్లాడలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఎల్లలు తెలియని మీరు పొంగులేటిపై మాట్లాడటం సరైనది కాదని కాదన్నారు. ఆయన అండా దండా, ఆర్థిక సహాయం లేనిదే మీరు ఎలా గెలిచారని ప్రశ్నించారు. ఒక్కసారి ఆయనను విమర్శించిన వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. పొంగులేటి వ్యాపారవేత్త అని అంటున్నారని, ఆయనకు మించిన వ్యాపారవేత్తలు మన జిల్లాలోనే ఉన్నారన్నారు. అయినా కూడా వారు పిల్లికి బిక్షం పెట్టరని ఎద్దేవ చేశారు. ఆయన విలువేంటో రానున్న రోజుల్లో తెలిసి వస్తుందని, అలా బాధపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. మరోసారి ఇటువంటి కారుకూతలు కూస్తే రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాయకులు తూము వెంకటనారాయణ, సర్పంచ్ బండారు ఏడుకొండలు, ఉప సర్పంచ్ దొడ్డ రామకృష్ణ, పొత్రు శ్రీనివాసరావు, మాగంటి శ్రీను, గొడుగులూరు లక్ష్మారెడ్డి, మీర్జా మైబు, ఎరువు గోపాలరావు, బూర్గు శ్రీను, పండ బాలకృష్ణ, కటికాల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.