
పోరెడ్డి పద్మజా దంపతులను సత్కరించిన అతిథులు
హైదరాబాదు :
హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం వైఎస్ఆర్టిసి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పో రెడ్డి రవీందర్ రెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన ఉద్దేశించి పలువురు మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య మాట్లాడుతూ రవీందర్ రెడ్డి నిన్నటి వరకు ఆర్టీసి ఉద్యోగి వరకు పరిమితం. ఇప్పుడు ఆయన ముందు అనేక అవకాశాలు ఉన్నవి. ఆర్టీసీ ఉద్యోగ పదవీ విరమణ అనంతరం సంకెళ్లు తొలగి అనేక సామాజిక సంఘ సమస్యల సాధనకొరకు ప్రత్యక్షంగా పోరాడే గొప్ప అవకాశం కలిగింది. స్వేచ్ఛగా తన అభిప్రాయాల తో ముందుకెళుతాడు. ప్రపంచంలో అవకాశాలు కూడా చాలా ఉన్నాయి అది ఆర్టీసీకే పరిమితం కావాలని ఆర్టీసీ యూనియన్ కార్యకర్త కోరుకోదు. మరో అడుగు ముందుకు వేసే దిశగా పార్టీ తోడ్పాటు అందజేసే విధంగా పార్టీ పెద్దలు ఆలోచిస్తారన్నాడు.అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ఆయన విశ్వరూపం ఏంటో చూపిస్తున్నాడని ఆయన పాలిస్తున్నటువంటి ఆ పాలకుల యొక్క స్వభావానికి సంబంధించినటువంటి విశ్వరూపం చూపిస్తున్నాడని . నీలాంటి వివక్షత రాష్ట్రం లో కార్మికులకు జరగకుండా కార్మికుల పక్షాన రవీందర్ రెడ్డి నిలబడి కార్మికులకు అండగా ముందుకు సాగాలని సూచించారు.రవీందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో విఎస్ రావు పాలడుగు భాస్కర్ టీవీ రావు మూర్తి శ్రీనివాస్ వెంకటేష్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందిన రవీందర్ రెడ్డి పద్మజ దంపతులను అతిధులు తోటి ఉద్యోగులు ఘనంగా సత్కరించారు..