పోలీసులకు జగన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి
Anantapur, Andhra Pradesh-ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ
ఈ69 న్యూస్, శింగనమల.
వైసీపీ నేత జగన్ మోహన్ రెడ్డి పోలీసులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో పాపిరెడ్డిపల్లి గ్రామవాసి లింగమయ్య మరణాన్ని రాజకీయం చేయడం జగన్ మోహన్ రెడ్డికి తగునా, మరణించిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించటంలో తప్పులేదు, కానీ కేవలం వైసీపీ పార్టీ ఉనికి కోసం, ఇంకొక పక్క ఓడించిన ప్రజల మీద కోపంతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న జగన్ బుద్ధి మారాలని పేర్కొన్నారు.ప్రజాస్వామ్య పరిపాలన సాగుతున్న కూటమి ప్రభుత్వ సారథ్యంలో పోలీసులు నిష్పక్షపాతంగా పని చేస్తున్నారు. పోలీస్ శాఖలో కింది స్థాయి నుండి అత్యున్నత స్థాయి వరకు మహిళలు పనిచేస్తున్నారు.అధికారం కోల్పోవడంతో, కోపంతో పోలీసులను బట్టలూడదీసి కొడుతాం, ఉద్యోగాలు తీసేస్తామని బెదిరింపు మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయికి తగునా అని జగన్ మాటమాటికీ పోలీసుల బట్టలూడదీస్తాం అంటుంటే మహిళ పోలీసులు మనోభావాలు దెబ్బతింటునాయన్నారు.మహిళలను కించపరుస్తున్నా జగన్ పట్ల మహిళల లోకం అసహ్యించుకుంటుందని తెలిపారు. సహజ మరణాన్ని రాజకీయానికి రాజకీయ రంగు పులిమి రెచ్చగొట్టే మాటలు మానాలని పులివెందుల రౌడీ రాజకీయాన్ని అన్ని నియోజకవర్గాల్లో చేయాలంటే కుదరని పని అని జగన్ తెలుసుకోవాలి అన్నారు. గత వైసిపి ప్రభుత్వం హయాంలో 2800 అఘాయిత్యాలు జరిగితే అప్పుడు బాధితులను ఎందుకు పరామర్శలు చేయలేదు. ఇప్పుడిలా ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని, పాపి రెడ్డి పల్లి లో మరణించిన లింగమయ్య కుటుంబ సభ్యులు లింగమయ్యది సహజ మరణమని రాజకీయాలు చేయొద్దని చెబుతున్నారు, దీనిపై నీ సమాధానమేంటని జగన్ ను ప్రశ్నించారు. అధికారం కోసం శవ రాజకీయాలు చేసే జగన్ పిచ్చి ప్రేలాపలను మాని, గత వైసిపిలో ఆగిపోయిన అభివృద్ధి తిరిగి అభివృద్ధి చేయుటకు, అలాగే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధికి చేయూత నివాలి తప్ప, రెచ్చగొట్టే మాటలు మానాలని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పేర్కొన్నారు.