
మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపులు నిర్వహించాలి
సిపిఎం నియోజకవర్గ కో కన్వీనర్ కారం పుల్లయ్య డిమాండ్
దుమ్ముగూడెం – గ్రామీణ ప్రాంతాలలో విష జ్వరాలతో ప్రజలు పిట్టల రాలిపోతున్న ప్రభుత్వానికి పట్టదని సిపిఎం నియోజకవర్గ కో కన్వీనర్ కారం పుల్లయ్య , సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ… మండలంలోని ప్రజలు విష జ్వరాలతో అల్లాడిపోతున్నారని ప్రభుత్వం పట్టీ పట్టనట్టుగా వ్యవరిస్తుందని ఇప్పటికే మండలంలో రోజు రోజుకి విష జ్వరాలతో మరణించిన సంఖ్య పెరుగుతుందని అన్నారు. తక్షణమే ప్రభుత్వం గ్రామాలలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో వైద్యశాఖ అధికారులు పర్యటించి మెడికల్ క్యాంపులు నిర్వహించి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. మరణించిన కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మండలంలోని హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎలా మంచి వంశీకృష్ణ. చంద్రయ్య. కొండపల్లి శ్రీధర్, బి. రమేష్,యాస నరేష్ ,సత్యనారాయణ. సాంబశివ. ప్రసాద్. వీరభద్రం. వీర్రాజు. అచ్చిరాజు. మధు, చంటి. మహేందర్ తదితరులు పాల్గొన్నారు