
seethakka news mulugu news local news e69news telugu galam news
ములుగు జిల్లాకు అభివృద్ధి నిధులు అధికంగా మంజూరు చేయాలని కోరిన మంత్రి సీతక్క
జిల్లాలో గోదావరి బెల్టు తో పాటు చిన్న చిన్న వాగులు పెద్ద పెద్ద చెరువులు చాలా ఉన్నాయి.
రామప్ప, లక్నవరం సరస్సులను అనుసంధానం చేయడం కోసం శాశ్వత గ్రావిటీ కాలువలు నిర్మాణం కోసం ల్యాండ్ అక్యువేషన్ జరిగింది.
పెండింగ్లో ఉన్న ల్యాండ్ అక్యువేషన్ కు డబ్బులు అందించాలి.
రాబోయే వేసవి కాలం లో త్రాగు,సాగు నీటి కి ఇబ్బంది లేకుండా చూడాలి.
మేడారం జాతర, పర్యాటక కేంద్రాలు జిల్లా లో ఉన్నందున వచ్చే బడ్జెట్ లో ములుగు జిల్లాకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
వరద ఉదృతిలో కొట్టుకు పోకుండా గోదావరి కరకట్ట నిర్మాణం చేపడుతున్నాం
వరదలు వచ్చినప్పుడు గ్రామాలు మునిగి పోయే ప్రమాదం ఉన్న చోట కటకట్ట నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాం.
మేడారం జాతరకు అన్ని జిల్లాల అధికారులు మంత్రులు సహకరించాలి.
జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి పెద్ద మొత్తం లో నిధులు మంజూరు చేయాలి.
25 లేదా 28 న మంత్రులు మేడారం జాతరకు రావాలని కోరారు.
మంత్రి సీతక్క కోరిన విధంగా ముంపు గ్రామాల శివారు గోదావరి వద్ద రిటెన్టింగ్ వాల్ నిర్మించాలి: మంత్రి పొంగు లేటి
ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఎఎస్, ఎస్పీ శభరిష్ , ఐ టిడి ఏ పి ఓ అంకిత్ ఐఎఎస్, అదనపు కలెక్టర్లు పి. శ్రీజ, డి. వేణుగోపాల్, ఆర్డీఓ కే. సత్య పాల్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.