ప్రజాధరణ ఆశ్రమానికి ప్రైజ్‌మనీ విరాళం
జఫర్గడ్ మండల కేంద్రంలో ఇటీవల నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ పోటీల్లో జఫర్గడ్ వారియర్స్ జట్టు ప్రథమ బహుమతి సాధించింది.ఈ సందర్భంగా తమ విజయంలో భాగంగా వచ్చిన ప్రైజ్‌మనీని టీబీతండాలో ఉన్న ప్రజాధరణ(మాఇల్లు)అనాథ ఆశ్రమానికి విరాళంగా అందజేశారు.క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నడిచిన ఈ పోటీల్లో గెలుపొందిన జఫర్గడ్ వారియర్స్ టీమ్‌కు వచ్చిన మొత్తం బహుమతి నగదురూ.15116ను ఆశ్రమానికి అందజేయడం జరిగింది.క్రీడలతో పాటు సామాజిక బాధ్యతను చాటిన ఈ కార్యక్రమం ఆదర్శంగా నిలిచింది.ఈసందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ అనాథల సంక్షేమం కోసం తమ ప్రైజ్ మనీని విరాళంగా ఇవ్వడం ఎంతో శ్రద్ధా హృదయంతో చేసిన ప్రశంసనీయమైన కార్యమని కొనియాడారు.యువత క్రీడలలో రాణించడమే కాక సమాజ సేవలోనూ ఆదర్శంగా నిలవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జఫర్గడ్ వారియర్స్ క్రికెట్ జట్టు సభ్యులు,నిర్వాహకులు పాల్గొన్నారు.