
హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

ఈ69న్యూస్ హనుమకొండ
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన వినతులను వెంటనే పరిశీలించి,తగిన చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ ప్రావీణ్య అధ్యక్షతన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడింది.ఇందులో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై మొత్తం 106 వినతులు సమర్పించారు.వినతుల స్వీకరణ అనంతరం,వాటిని సంబంధిత శాఖల అధికారులకు అప్పగిస్తూ,వెంటనే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ప్రతి వినతి సమస్యకు సంబంధించిన సమాచారాన్నిత్వరగా శాసించాల్సిన అవసరం ఉందని,ప్రజలలో ప్రభుత్వంపై నమ్మకాన్నిపెంచేందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులను కలెక్టర్ కోరారు.కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి,రెవెన్యూ అధికారి వై.వి.గణేష్,గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను,హనుమకొండ,పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్,డాక్టర్ నారాయణ,పలు మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.