
badrachalam news
రేషన్ కార్డులు లేని అర్హులైన వారి కి కూడా ఆరు గ్యారెంటీలను వర్తింప చేయాలి
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు విజ్ఞప్తి..
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన గ్రామసభలలో కొత్త రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు చేసుకున్న వారి నుండి దరఖాస్తులు స్వీకరించాలని, రేషన్ కార్డులు లేని అర్హులకు కూడా ఆరు గ్యారెంటీలను వర్తింపచేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు.
భద్రాచలం పట్టణంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీమతి నాగలక్ష్మి గారితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదని, వందలాదిమంది రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ప్రభుత్వం ఇవ్వలేదని అన్నారు. ప్రజా పాలన గ్రామసభలలో ప్రభుత్వం ఇచ్చిన దరఖాస్తులు రేషన్ కార్డు జిరాక్స్ కాపీ లేదా నంబరు అడగడం వల్ల రేషన్ కార్డు లేని అర్హులు ఏమి రాయాలో తెలియనటువంటి పరిస్థితులలో ఉన్నారని అన్నారు. రేషన్ కార్డు లేని అర్హులకు 6 గ్యారంటీల పథకాలు అమలు అవుతాయో లేదో అని ప్రజలు ఆవేదన చెందుతున్నారని అందుకోసం ఈ గ్రామ సభలోనే రేషన్ కార్డు కోసం దరఖాస్తులు స్వీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు.