
badrachalam news
సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి విజ్ఞప్తి…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా పాలన గ్రామసభల దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీని జనవరి 10 వరకు పొడిగించాలని సిపిఎం భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి విజ్ఞప్తి చేశారు.
డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు ప్రజా పాలన గ్రామసభలు నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించిందని మధ్యలో సెలవులు రావడం వల్ల అనేకమంది ప్రజలు దరఖాస్తులు పెట్టుకోవడంలో ఇంకా వెనకబడి ఉన్నారని, అందుకోసం ఆరు గ్యారెంటీ ల కొరకు దరఖాస్తుల స్వీకరణను ఈ నెల 10 వరకు పొడిగించాలని, అన్ని మండల ఆఫీసులు గ్రామపంచాయతీలు వద్ద కౌంటర్లు ఏర్పాటు చేసి జనవరి 10 వరకు దరఖాస్తులు తీసుకోవాలని ఆయన కోరారు. మరో నాలుగు రోజులు సమయం పొడిగించడం వల్ల ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అందడానికి అవకాశం ఏర్పడుతుందని ఆయన విజ్ఞప్తి చేశారు.