
telugu galam news e69news local news daily news today news
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు ఐద్వా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బండారు శ్రీదేవి 6వ వర్ధంతి సభ
కష్టకాలంలో ప్రజా పోరాటాలను ముందుకు తీసుకుపోవడమే అమరజీవి కామ్రేడ్ బండారు శ్రీదేవి కి మనం ఇచ్చే ఘన నివాళి అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు. సిపిఎం సీనియర్ నాయకులు బి బి జి తిలక్ గారి సతీమణి ఐద్వా సీనియర్ నాయకులు అమరజీవి కామ్రేడ్ బండారు శ్రీదేవి 6వ వర్ధంతి సభ బెల్లంకొండ కుసుమ అధ్యక్షతన జరిగింది. బండారు శ్రీదేవి చిత్రపటానికి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బి నర్సారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు బిబిజి తిలక్ ఐద్వా సీనియర్ నాయకులు నాదెళ్ల లీలావతి లు పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, ఐద్వా పట్టణ కార్యదర్శి డి.సీతాలక్ష్మి లు మాట్లాడుతూ కామ్రేడ్ బండారు శ్రీదేవి గారు పార్టీ, మహిళా సంఘం(ఐద్వా) కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారని అన్నారు. పార్టీ,ప్రజా సంఘం కార్యకర్తల పట్ల ఆమె ఆప్యాయంగా ఉండేవారని, నాయకుల పట్ల నమ్రతతో మెలిగేవారని అన్నారు. పార్టీ, ప్రజా సంఘం అభివృద్ధి పట్ల అంకితభావంతో పనిచేసేవారని అన్నారు. నేడున్న ప్రతికూల పరిస్థితులలో పార్టీ, ప్రజా సంఘం అభివృద్ధి కోసం పనిచేయడమే ఆమెకు మనం ఇచ్చే ఘన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి సీనియర్ నాయకులు బి బి జి తిలక్ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబు పట్టణ కమిటీ సభ్యులు ఎన్ నాగరాజు ,కే శ్రీనివాస్, భూపేంద్ర, కుంజా శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఏం ఎస్ నారాయణ, డి రామకృష్ణ కుటుంబ సభ్యులు బండారు అరుణ్ చంద్, ప్రతాప్,సుందరయ్య ఐద్వా నాయకులు సుబ్బలక్ష్మి, జి.నాగలక్ష్మి, సక్కుబాయి ,సుశీల, సరోజిని, రాధా, బేగం, హైమావతి, తదితరులు పాల్గొన్నారు..