
వీరనారి ఐలమ్మ వర్ధంతి సభలో మాట్లాడుతున్న సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు చీకటి అయిలమ్మ వర్ధంతి సభను శ్రామిక భవన్లో నిర్వహించడం జరిగింది. ఈ సభకు పార్టీ జిల్లా నాయకుడు వెలిశెట్టి రాజయ్య అధ్యక్షత వహించగా పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు మాట్లాడుతూ ప్రజా విముక్తి పోరాటానికి మతరమాలనే బిజెపి కుట్ర చేస్తుందని పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు అన్నారు.అయిలమ్మ పోరాట తెగువ స్ఫూర్తిదాయకమని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రైతన్న సాయుధ పోరాట నికి మతతత్వ సంఘం పరివారం శక్తులు, మతరంగుతున్నారని, నీ కాళ్ళు మొక్కుతా అనే స్థాయి నుంచి దుర ఏందిరో వాడి పీకుడు ఎందరో అనగలిగే ధైర్యాన్ని ఇచ్చిన మహత్తర పోరాటానికి వక్ర భాష్యాలు చెప్పడం విడ్డూరంగా ఉందని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ కార్యదర్శి కామ్రేడ్ బందు సాయిలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు శ్రామిక భవన్లో నిర్వహించిన చీకటి అయిలమ్మ వర్ధంతి సభను ఉద్దేశించి పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాచరికనికి వ్యతిరేకంగా తెగబడి తిరగబడ్డ పోరాటం తెలంగాణ సాయుధ రైతంగా పోరాటమని అన్నారు. ఆ పోరాటంలో మహిళల పాత్ర యువకుల పాత్ర దళితుల పాత్ర గిరిజనుల పాత్ర అన్ని వర్గాల పాత్ర కీలకంగా ఉంది అని అన్నారు. చిట్యాల ఐలమ్మ తో పాటు అజ్ఞాత వీరవనితలు, వీరులు అనేకమంది ఉన్నారు. భూమికోసం ,భుక్తి కోసం జరిగిన రైతాంగ సాయుధ పోరాటానికి ఆర్ఎస్ఎస్, బిజెపి శక్తులు మత ప్రాతిపదికన జరిగిన పోరాటంగా చిత్రీకరించే కుయుక్తులు పాల్పడుతున్నారని విమర్శించారు.నాటి పోరాటంలో బిజెపి దాని పరివారం పాత్ర లేదని తెలిపారు. ఈ పోరాటంలో ముద్దు మైనోద్దీన్, అల్లం కుందు మీరు, సోయాబుల్లాఖాన్ మూర్తుజా హైదర్ సయ్యద్, ఇబ్రహీం బంధంగి, దొడ్డి కొమరయ్య, భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి అనేకమంది వీరులు పోరాడి ప్రాణ త్యాగాలు చేశారు. కుల మత భేదాలకు అతీతంగా వెట్టి షాకిరి నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటంలో సబ్బండ కులాలు పాల్గొన్నారు. ఆ పోరాటంలో నాలుగువేల మంది విప్లవ వీరులు ప్రాణాలు కోల్పోయారు. పదివేల మంది నిర్బంధము దారుణమైన చిత్రహింసలు సాంఘిక సాంఘిక దాడులు అయినా మొక్కవోని ధైర్యంతో సాగిన పోరాటాలను ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు జరిపిన పోరాటంగా చరిత్రకు వక్రభాషలు చెబుతున్నా మతతత్వవాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 10న వీరనారి ఐలమ్మ వర్ధంతిని జరుపుకుంటున్నామని తెలిపారు. 10 లక్షల ఎకరాల భూముల్ని పేద ప్రజలకు పంచన చరిత్ర కమ్యూనిస్టు పార్టీలది. ఇసునూరు రామచంద్రారెడ్డి ఆగడాలకు వ్యతిరేకంగా, నిజాము నీ బాబుకు వ్యతిరేకంగా సాగిన మహత్తర తెలంగాణ రైతన్న సాయుధ పోరాటంలో ప్రాణాలు అర్పించిన వారి ఆశయాల కోసం ఆశయాల కోసం నిలబడి భూ పోరాటాలు ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఏ రమేష్, జి శేఖర్,ఏ మహేందర్, మేకల మహేందరు,రవి, రజిని,కోమల, రజిత,రాజశేఖర్,బిక్షపతి తదితరులు పాల్గొన్నారు