
ఎండిన పంటల సందర్శన
ఈ69న్యూస్ జఫర్ఘడ్
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం ఓబులాపురం గ్రామంలో ప్రభుత్వం చెప్పిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని గ్రామంలోని స్థానిక సమస్యలను పరిష్కరించాలని పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండెబోయిన రాజు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి సోమయ్య జిల్లా కమిటీ సభ్యురాలు ఎండి షబానా మాట్లాడారు..గ్రామంలో ప్రధానంగా వరి మొక్కజొన్న పంటలు పెట్టుబడి పూర్తి అయ్యి పంట చేతికి వచ్చే సమయంలో భూగర్భ జలాలు అడుగంటిపోయి బావులు బోర్లు ఒకేసారి ఆగిపోవడం పంటలు ఎండిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు వెంటనే ఎండిపోయిన పంటలను పూర్తిస్థాయిలో సర్వే చేసి ఒక ఎకరానికి 50వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని దేవాదుల ద్వారా నీరు తో చెరువు కుంటలను నింపాలని ఉప్పుగల్లు నుండి పాలకుర్తి రిజర్వాయర్ మెయిన్ కెనాల్ మరియు పాలకుర్తి రిజర్వాయర్ ను పూర్తి చేయాలని రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పడం కాదు రైతుల కు పూర్తిస్థాయిలో రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా బోనస్ 500 రాని వారికి వెంటనే వేయాలని డిమాండ్ చేశారు.