
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే సీపీఎం అభ్యర్థిని గెలిపించండి
మండలం లో సీపీఎం అభ్యర్థి ప్రచారం కొమురవెల్లి నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే సీపీఎం పార్టీ జనగామ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి మోకు కనకారెడ్డి ని గెలిపించాలని కోరుతూ కొమురవెల్లి మండలం లో ప్రచారం నిర్వహించారు. మంగళవారం రోజున మండలం లోని మర్రిముచ్చాల,గౌరాయపల్లి,కొమురవెల్లి,రాంసాగర్ గ్రామాలలో అభ్యర్థి ప్రచారం జరిగింది.ఈ సందర్భంగా కొమురవెల్లి సీపీఎం ఆఫీస్ లో జరిగిన విలేఖర్ల సమావేశంలో కనకారెడ్డి మాట్లాడుతూ గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు జనగామ నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా,ప్రజా సమస్యల పరిష్కారం చేయకుండా నియోజకవర్గాన్ని అత్యంత వెనుకబాటుకు గురి చేశారని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై భారాలు వేసిందని, ప్రభుత్వ రంగాన్ని మొత్తం కార్పోటు శక్తులకు అప్పగించి ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేస్తుందని విమర్శించారు. ప్రజల మధ్య కులాలు మతాల పేరుతో అనైక్యతను సృష్టించి ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ తొమ్మిదిన్నర ఏళ్లలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజాధనాన్ని లూటి చేస్తున్నారని రాష్ట్రంలో దళితులకు మూడు ఎకరాల భూమిని డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇంటికో ఉద్యోగం కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య రైతు రుణమాఫీ లాంటి అనేక హామీలు ఏమాత్రం అమలు చేయలేదని పైగా మళ్లీ అధికారంలోకి రావడం కోసం అనేక వాగ్దానాలు చేసి ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి పార్టీల నుండి పోటీ చేస్తున్నవారు ఎవరూ జనగామ నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై పోరాడిన వారు కాదని కేవలం ఓట్ల కోసమే వచ్చి ధన బలంతో ఓట్లు కొని గెలవాలని చూస్తున్నారని అలాంటి వారికి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో సిపిఎం రైతులు కార్మికులు వ్యవసాయ కూలీలు మహిళలు విద్యార్థులు యువజనలు వృత్తిదారుల వ్యాపార వాణిజ్య అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం చేర్యాల డివిజన్ కావాలని అనేక ఉద్యమాలు నిర్మించిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో సిపిఎం పార్టీని గెలిపించడం ద్వారా శాసనసభకు ప్రశ్నించే గొంతుకను పంపించాలని అప్పుడు నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో సహితం అలిపెరుగని పోరాటం నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, చేర్యాల మాజీ జెడ్పిటిసి దాసరి కళావతి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్ల బండి శశిధర్ బూడిద గోపి సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు గోపాలస్వామి సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొమురవెల్లి మండల కార్యదర్శి చిట్టి పల్లి సత్తిరెడ్డి సర్పంచ్ చెరుకు రమణారెడ్డి తాడూరు రవీందర్ జిల్లా కమిటీ సభ్యులు కృష్ణారెడ్డి భాస్కర్ ఆలేటి యాదగిరి అత్తిని శారద దాసరి ప్రశాంత్ చొప్పరి రవికుమార్ నాయకులు తేలుస్తారు సురేందర్ రెడ్డి వరలక్ష్మి కృపాకర్ సార్ల యాదయ్య రవీందర్ తాడూరు మల్లేశం నీల బిక్షపతి భరత్ కుమార్ రాజు నరేష్ బాలరాజు దాసరి బాలస్వామి చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.