
ఈ69న్యూస్ వరంగల్
హనుమకొండ రాంనగర్లోని నివాసంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ప్రజల నుంచి వినతులు స్వీకరించడంతో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు.ప్రజల భాద్యతగా తీసుకుని ప్రతీ సమస్యను శ్రద్ధగా విని,సంబంధిత అధికారులతో వెంటనే ఫోన్లో మాట్లాడి పరిష్కార మార్గాలు సూచించారు.పౌరులు అధికారులు లేదా ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా,వినతులను వేగంగా పరిష్కరించేలా అధికారులను ఆదేశించారు.ప్రజలు ఎలాంటి పైరవీలు చేయాల్సిన అవసరం లేకుండా నేరుగా తనను సంప్రదించవచ్చని తెలిపారు.ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని,కార్యకర్తలు లేదా నాయకులకు ఏ అపాయం వచ్చినా దాన్ని వ్యక్తిగత బాధ్యతగా తీసుకుని ముందుంటామని చెప్పారు.