
ప్రధానోపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని సందర్శించినా జిల్లా కలెక్టర్
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉన్నతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుపరిచి విద్యార్థుల అభ్యసనాభివృద్ధి కోసం ప్రతి ప్రధానోపాధ్యాయుడు తమ సబ్జెక్టు టీచర్ల సహాయంతో కృషి చేయాలని అనుమకొండ జిల్లా పరిపాలనాధికారి శ్రీమతి సిక్తా పట్నాయక్ కోరారు. తొలిమెట్టు కార్యక్రమము లాగానే ఉన్నత తరగతుల విద్యార్థులకు ఉన్నతి కార్యక్రమాన్ని తరగతి వారి అభ్యసన సామర్ధ్యాలు, తరగతికి సంబంధించిన సామర్థ్యాలు సాధించడానికి తెలంగాణ ప్రభుత్వము ఉన్నతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించిందని ఆమె తెలిపారు. ఉన్నతి కార్యక్రమం పై ప్రధానోపాధ్యాయులు మూడు రోజుల శిక్షణ కార్యక్రమములో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో ఉపయోగించాలని, ప్రవేశపెట్టిన ఉన్నతి కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులందరూ నిర్ధారిత తరగతి సామర్థ్యాలు విద్యార్థులు చేరుకునేట్లుగా చూడాలని ఆమె తెలిపారు. వెనుకబడి ఉన్న విద్యార్థులను గ్రూపులుగా చేసి వారి అభ్యసనము పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి సామర్థ్యాలు పొందేలా చూడాలని అన్నారు. బోధన పీరియడ్ తో పాటు అభ్యాస పీరియడ్ కూడా సమయము ఇచ్చి ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ చూపటం ద్వారా విద్యార్థులు సొంతంగా అభ్యసించేట్టు చేయాలని ఆమె తెలిపారు. ఉన్నతి కార్యక్రమం విద్యార్థులు ఉన్న స్థానము నుండి ఉన్నతమైన స్థానానికి వెళ్లేందుకు దోదపడుతుందని ఆమె తెలిపారు. 10వ తరగతి విద్యార్థులు 2023 -24 విద్యా సంవత్సరం లో మంచి ఫలితాలు సాధించాలని గత విద్యా సంవత్సరము 10వ తరగతిలో మన జిల్లా ఫలితాలు ఆశాజనకంగా లేవని ఆమె తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుండి పాఠశాల విద్యపై తాను కూడా ప్రత్యేక శ్రద్ధ పెడతానని, త్వరలో మళ్లీ ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహిస్తానని , హనుమకొండ జిల్లా విద్యా కేంద్రంగా వర్ధిల్లుతోందని అందువలన మంచి ఫలితాలు సాధించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె తెలిపారు. జిల్లా విద్యాధికారి అబ్దుల్ హై మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో ప్రధానోపాధ్యాయులు ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన ఉపాధ్యాయులు తరగతి బోధనా తీరును పరిశీలించి బోధనను ఆకర్షణీయంగా మలచడానికి తగు సూచనలు అందించాలన్నారు. విద్యార్థులతో స్నేహపూర్వకంగానే ఉంటూ, వారి తల్లిదండ్రులతో మాట్లాడుతూ, సమాజ భాగస్వామ్యాన్ని కూడా కల్పించి విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ శ్రీ శ్రీనివాస్ మూడు రోజుల శిక్షణలో పొందుపరిచిన అంశాలను సంక్షిప్తంగా వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్కిల్ స్టార్క్ ఇంటర్నేషనల్ స్కూలు కరస్పాండెంట్ అనుపురావు , జిల్లా రిసోర్స్ పర్సన్లు రామకృష్ణ పట్టాభి వేణు ఆనంద్ మనోహర్ నాయక్ స్థానిక మండల విద్యాశాఖ అధికారి రామకృష్ణంరాజు, మధుసూదన్ రెడ్డి, జ్ఞానేశ్వరి, సంపత్, నరేందర్ రెడ్డి, సంపతి, మహేష్ , గౌస్ పాషా మొదలగు వారు పాల్గొన్నారు. ఉన్నతి కార్యక్రమం పై ప్రధానోపాధ్యాయులందరికీ క్విజన్ నిర్వహణమూడు రోజులపాటు నిర్వహించిన ఉన్నతి కార్యక్రమ శిక్షణకు సంబంధించిన అంశాలపై జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు అందరికీ కూడా శిక్షణ కార్యక్రమాన్ని బేస్ చేసుకొని క్విజ్ పోటీని నిర్వహించారు. ఆన్లైన్ ద్వారా నిర్వహించిన ఈ పోటీలో ప్రధానోపాధ్యాయులు చక్కటి ప్రతిభ కనపరిచారని, ఈ విజ్ఞానాన్ని తమ విద్యార్థుల శ్రేయస్సు కోసం ఉపయోగించాలని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు.