
-దక్షిణ భారత ప్రచార ఉప కార్యదర్శి మౌల్వీ సయ్యద్ ఫహీం అహ్మద్
ఈ69 న్యూస్ ఆత్మకూరు డిసెంబర్ 08
అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ దక్షిణ భారత ప్రచార శాఖ కమిటీ ఆధ్వర్యంలో ఆత్మకూరు మండలం హౌజ్బుర్గ్ గ్రామంలో శిక్షణ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి దక్షిణ భారత ప్రచార ఉప కార్యదర్శి మౌలానా సయ్యద్ ఫహీం అహ్మద్ (ఖాదియాన్ పంజాబ్) ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.ప్రపంచ శాంతి స్థాపన కోసం అహ్మదీయ ముస్లిం జమాత్ స్థాపించడం జరిగిందని,ప్రతి ఒక్కరూ శాంతి గురించి ప్రచారం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఉపాధ్యక్షులు ముహమ్మద్ సలీం,తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మౌల్వీ షబ్బీర్ అహ్మద్,స్ధానిక సదర్ సయ్యద్ వలీ,సర్కిల్ ఇంచార్జ్ ముహమ్మద్ అక్బర్ మరియు స్ధానిక మౌల్వీ సయ్యద్ కరీం,ఉమ్మడి వరంగల్ జిల్లా లోని వివిధ గ్రామాల నుండి హాజరైన గ్రామ శాఖ అధ్యక్షులు మరియు ప్రచార కమిటీ శాఖ కార్యదర్శులు,మౌల్వీలు పాల్గొన్నారు.