ప్రభుత్వం అన్ని విధాలుగా వరద బాధితులకు అండగా ఆదుకుంటాం
Mahabubabadభారీ వర్షాల,వరదల నేపథ్యంలో జిల్లా లో పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. జిల్లా అధికారులతో సమీక్ష సమావేశంలో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని అని అన్నారు సీతారం తండ ముంపు గ్రామాన్ని సందర్శించి బాదితులకు మనోదైర్యాన్ని నింపిన ముఖ్యమంత్రి
మరిపెడ – పురుషోత్తమాయ గూడెం జాతీయ రహదారి వరదల కారణంగా కొట్టుకుపోయిన రోడ్లను పరిశీలించారు ఇండ్లు నష్టపోయిన వారికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు.చనిపోయిన వారికి 5 లక్షల నష్టపరిహారం ఇస్తామన్నారు పది రోజుల వరకు నిత్యావసర సరకులు ఉచితంగా పంపిణీ కుటుంబానికి పది వేల చొప్పున తక్షణ సహాయం అందజేయాలని కలెక్టర్‌కి సూచించారు ఆకేరు వాగులో పంటనష్టం అయిన వారికి ఎకరానికి పదివేల చొప్పున ఆర్ధిక సహాయం పశు నష్టం, పంట నష్టం ఇతర వాణిజ్య పంటల నష్టం పై ప్రత్యేక సర్వే నిర్వహించి పరిహారం అందజేస్తాం అని అన్నారు.
ఆకేరు వాగు పొంగి ఇండ్లలోని పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్ కార్డులు,సర్టిఫికెట్లు తడిచిపోయినందున ఒకే ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేసి అందరికి నూతన కార్డులు, సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశించారు.ఆకేరు ప్రవాహం నీటి నియంత్రణ పై శాస్త్రీయంగా అంచనా వేసి నూతన వంతెనను నిర్మించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు
జిల్లాలో 28 సెంటిమీటర్ల వర్షం కురిసినప్పటికీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు.అయినా ప్రాణ నష్టం జరగడం బాధాకరమన్నారు,జిల్లాలో 4గురు చనిపోయారు. అందులో ఇద్దరు ఈ జిల్లా వాసులు, మరో ఇద్దరు ఖమ్మం జిల్లా వాసులు మహబూబాబాద్ జిల్లాలో సుమారు 30 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 680 మందికి పునరావాసం కల్పించాం.సీతారామతండా లో వరద సమయంలో ప్రజలకు అండగా నిలబడ్డ ఎస్సై నగేష్ కి అభినందనలు తెలియజేశారు చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తాం ఆకేరు వాగు వరద బారిన పడుతున్న 3 తండాలను సురక్షితమైన ప్రాంతానికు తరలించాలని కలెక్టర్ ను ఆదేశించారు. పంట నష్టం జరిగిన ప్రతి ఎకరానికి పదివేల సాయం జాతీయ విపత్తు గా ప్రకటించాలని ప్రధాని కి లేఖ రాశాం అని అన్నారు.జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి రాష్ట్రానికి రావాలని ప్రధానమంత్రి ని కోరుతున్నాం అని అన్నారు వరదతో చేరిన బురదను తొలగించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి దోమల నివారణ చర్యలు తీసుకోవాలి నష్టం జరిగిన ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఇతర ప్రాంతాల నుంచి అధికారులను రప్పించుకోవాలి. కూలిపోయిన విద్యుత్ లైన్లను తక్షణమే పునరుద్దరించాలి అని అన్నారు వరద ప్రమాద ప్రాంతాలు, ప్రమాదానికి కారణాలు, వాటిని ఎదుర్కొన్న తీరుపై బ్లూబుక్ ను తయారు చేసుకోవాలి అని అన్నారు వాటిని కలెక్టరేట్లలో ఉంచాలని హైడ్రా తరహా లో జిల్లా లో ఒక వ్యవస్థ ను కలెక్టర్లు ఏర్పాటు చేసుకోవాలి అని చెరువులను ఆక్రమించుకోవడం క్షమించరాని నేరం చెరువు ల ఆక్రమణలపైన రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపడతాం చెరువుల ఆక్రమణలో ఎంతటి వారున్నా వదిలి పెట్టం. చెరువుల ఆక్రమణకు సహకరించిన అధికారులపైన చర్యలు తీసుకోవాలి చెరువులు, నాలాల ఆక్రమణల జాబితా సిద్దం చేయాలి అక్రమ నిర్మణాల వల్లనే ఖమ్మంలో వరదలు వచ్చాయి అని అన్నారు ఆక్రమణల తొలగింపునకు పక్కా ప్రణాళిక స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు వరద బాధితులకు సాయం కోసం ముందు కు రావాలి,
ఎడతెరిపి లేని వర్షాలు వరద బీభత్సం తీవ్ర నష్టం మిగిల్చిందని ప్రధాని నరేంద్ర మోదీ ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించి అందించాలని తక్షణ సహాయము అందించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ భూములు కుంటలు చెరువులను యధేచ్చగా కబ్జా చేసిన భూ కబ్జాదారుల పై చర్యలు తీసుకుంటాం.జల ప్రలయంలో మృతి చెందిన ప్రతి ఒక్కరికీ 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తాం.
పురుషోత్తమాయగూడెం ఆకేరు వాగులో మృతి చెందిన తండ్రి కూతురు కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తాం.వరద ప్రవాహంలో సర్వం కోల్పోయిన మూడు తండాలకు చెందిన ప్రజలకు సురక్షిత ప్రాంతంలో ఒకే చోట కాలనీ రూపంలో ఇల్లు నిర్మిస్థాం.వరదల్లో మృతి చెందిన పశువులకు 50 వేల రూపాయలు మేకలు గొర్రెలకు నష్టపరిహారం అందిస్తాం అని అన్నారు వరద ప్రవాహంలో 30 వేల ఎకరాలలో పంటల నష్టం జరిగిందని ప్రతి ఎకరాకు పదివేల రూపాయల పంట పరిహారం అందిస్తాం.ధ్వంసమైన రహదారులు ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా సహాయాన్ని అందిస్తాం.హైదరాబాద్ లో హైడ్రా తరహా ప్రక్రియను మహబూబాబాద్ లో కూడా అమలు అమలు చేస్తామన్నారు,
వరద బాధితుల కోసం తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు ఒక్కరోజు మూలవేతనాన్ని విరాళంగా ఇవ్వడం హర్షించదగ్గ విషయం మన్నారు,
మహబూబాబాద్ పట్టణానికి చెందిన ఏడవ తరగతి విద్యార్థిని సాయి సింధు, తన కిట్టి బ్యాంక్ బ్యాలెన్స్ 3వెలు ముఖ్యమంత్రి సహాయనిధి, వరద బాధితుల సహాయార్థం అందజేశారు,రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.భారీ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురి అయిన రైల్వే ప్రయాణీకులు 17వందల మందిని సురక్షిత ప్రాంతాలకు పంపి వారికి కావాల్సిన ఆహారం, వసతి అందించి జిల్లాలో ఆస్తి,ప్రాణ నష్టం తగ్గించిన అధికంగా లేకుండా ముందస్తు ప్రణాలికలతో పనిచేసిన జిల్లా యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదలు కారణంగా నష్ట పోయిన వారి వివరాలు తెలుసుకుంటూ క్షేత్ర స్థాయిలో ఆదేశాలు జారీ చేస్తూ, నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి జిల్లా పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్ర గ్రామీణ మంచినీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ..విపత్తులు సంబవించినపుడు నష్ట నివారణ కోసం ప్రత్యేక అన్ని విభాగాలతో ప్రత్యేక కోఆర్డినేషన్ కమిటీ నియమించాలన్నారు. జిల్లా లో జరిగినప్రాణ,పశు,ఆస్తి,పంట,రోడ్లు,చెరువులు నష్టం యొక్క పూర్తి వివరాలు సేకరించాలన్నారు. జిల్లా లో వర్షాల కారణంగా ముందస్తు ప్రణాళికలతో పనిచేసిన వారి సేవలు మరువలేనివి అన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, విప్ డాక్టర్ రామచంద్రనాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ ఆర్ కేకన్, నూకల నరేష్ రెడ్డి మరిపెడ మండల పార్టీ అధ్యక్షులు పెళ్లి రఘువీరారెడ్డి సంబoధిత అధికారులు. పాల్గొన్నారు.