ప్రభుత్వం తరఫున విడుదలయ్యే అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలి
Uncategorizedగోదావరి వరద ముంపు గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని కలెక్టర్ నీ ఆదేశించారు
నూతనంగా నిర్మిస్తున్న కరకట్ట నీ పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలి అని అధికారులను ఆదేశించారు
- తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ పంచాయతీరాజ్ సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
భద్రాచలంలోని గోదావరి వరదలు ముంపునకు గురి అయ్యే గ్రామాలను వరద తాకిడికి గురికాకుండా నూతనంగా నిర్మిస్తున్న కూనవరం రోడ్డులోని కరకట్ట ప్రదేశాలను ఆయన పరిశీలించారు. గోదావరి వరదల ప్రభావం ఎంత మేరకు వస్తే గ్రామాలు ముంపునకు గురి అవుతాయని సంబంధిత సీఈని అడిగి తెలుసుకుని 33 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపడుతున్న కరకట్ట ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గోదావరి వరదల వలన ఆదివాసి గిరిజన గ్రామాలలోని గిరిజన కుటుంబాలు వరదల వలన చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని దృష్టిలో పెట్టుకొని నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కరకట్ట నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. వచ్చే సంవత్సరం ఆగస్టు నాటికి పూర్తి స్థాయిలో కరకట్ట నిర్మాణం పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఉన్న హయాంలో సీతారామయ్య ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయడం జరిగిందని ప్రాజెక్టు నిర్మాణానికి 24 కోట్లు శాంక్షన్ చేయడం జరిగిందని సుమారు రెండు లక్షల 70 వేల ఎకరాలకు నీరందించడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన ఆ ప్రాజెక్టుని పూర్తిస్థాయిలో నిర్మాణం చేయకుండా కాలయాపన చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలల వ్యవధిలో మూడు నెలలు ఎంపీ ఎలక్షన్ల కోడ్ ఉన్నందువలన పనులు చేయలేకపోయామని ప్రస్తుతానికి బీద ప్రజానీకానికి ఇబ్బందులు కలగకుండా ఈరోజు సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించడానికి ట్రయల్ రన్ ప్రారంభించామని అది విజయవంతం అయిందని దాదాపు 15 క్యూసెక్కుల నీరు విడుదల చేయనున్నామని ఆయన అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం నాలుగు పంపుల ద్వారా 104 కిలో మీటర్లు నీటి సరఫరాకు ప్రధాన కాలువలు పూర్తి చేశామని ఈ కాలువకు ఏంకూరు వద్ద నాగార్జునసాగర్ కాలువకు అనుసంధానం చేయనున్నామని తద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 1.20 లక్షల ఎకరాలకు మొదటి విడతగా సాగునీరు అందించినట్లు తెలిపారు. వచ్చే మూడు సంవత్సరాలలో విడుదలవారీగా సీతారామ ఎత్తిపోతల పథకం పూర్తిచేసి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆరు పాయింట్ 74 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఆయన అన్నారు. అనంతరం గోదావరి కరకట్ట పక్కన ఉన్న విస్తా కాంప్లెక్స్ దగ్గరలోని పంపింగ్ స్లోయిస్ పాయింట్‌ను పరిశీలించి వరద ఎక్కువైనప్పుడు ఎన్ని క్యూసెక్కుల నీరు దీని ద్వారా గోదావరి సంబంధిత సీ అని అడిగి తెలుసుకుని ఇక్కడ పర్మినెంట్‌గా పంపిణీ ఏర్పాటు చేయాలని గేట్లు కూడా నిర్మాణం చేపట్టాలని వర్షాకాలం పోయిన తర్వాత దీనికి సంబంధించిన పనులు ప్రారంభించాలని అందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఆదివాసి గిరిజన గ్రామాల ప్రజలు గోదావరి వరదలు వచ్చినప్పుడు అధైర్య పడకుండా అధికారులు సూచించిన ప్రకారము వరద తాకిడి రాకముందే అధికారులు చూపిన ప్రదేశాలకు చేరుకోవాలని తప్పకుండా అధికారులు అన్ని సౌకర్యాలు కల్పిస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు వైరా శాసనసభ్యులు రామదాసు నాయక్ అశ్వరావు పేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఐటీడీఏ పీవో రాహుల్ సి ఈ శ్రీనివాసరావు ఈ ఈ రాంప్రసాద్ డి ఈ మస్తాన్‌రావు ఏఈ వెంకటేశ్వరరావు వివిధ శాఖ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.