
బి.యస్.ఫ్ మరియు యస్. యస్.యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా
హనుమకొండ నగరంలోని వడ్డేపల్లి ఎన్జీవోస్ కాలనీలో ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న శ్రీ చైతన్య పాఠశాలను మూసివేయాలని పాఠశాల ముందు బహుజన విద్యార్థి సంఘం(బి.యస్.ప్)మరియు స్వేరో స్టూడెంట్ యూనియన్(యస్.యస్.యూ)ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బి.ఎస్.ఎఫ్ కే.యూ ఇన్చార్జి,హనుమకొండ జిల్లా అధ్యక్షులు బొట్ల మనోహర్ మరియు స్వేరో స్టూడెంట్ యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు ఏల్తురి సాయికుమార్ మాట్లాడుతూ..హనుమకొండ పెట్రోల్ పంపులో శ్రీ చైతన్య పాఠశాల నడుపుతూ అకాడమిక్ ఇయర్ మధ్యలో తల్లిదండ్రులకు చెప్పకుండా ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా అకాడమిక్ ఇయర్ మధ్యలోనే ఆకస్మాత్తుగా పాఠశాలను హన్మకొండ పెట్రోల్ పంపు నుండి వడ్డేపల్లి ఎన్జీవోస్ కాలనీకి మార్చినారని అసలు అకడమిక్ ఇయర్ మధ్యలో పాఠశాలను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించడం అనేది ప్రభుత్వ విద్యాశాఖ నియమ నిబంధనలకు విరుద్ధమని దానికి విరుద్ధంగా పాఠశాలను తరలించారని అది ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నదని దానికి ఎలాంటి గ్రౌండ్ లేదని ఎలాంటి బోర్డు లాంటివి లేకుండా నిర్వహిస్తున్నారని అనుమతి ఉందని చెప్పేసి తల్లిదండ్రులు మోసం చేస్తూ ఉపాధ్యాయులకు విద్యార్థులను ఎక్కువ సంఖ్యలో చేర్పించాలని టార్గెట్ పెడుతూ వారిని పలు కాలనీ లకు ఎండలో ప్రచారానికి పంపుతూ ఇబ్బందుల గురి చేస్తున్నారని ప్రభుత్వ అనుమతి లేకుండా నడుపుతున్న శ్రీ చైతన్య పాఠశాలలను మూసివేయాలని డిమాండ్ చేశారు.లేనియెడల అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకుని ముందు ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు వార్కల ప్రసన్న కుమార్,మహమ్మద్ అలీమ్ పాష,దుర్గం రవి,చెట్టుపల్లి శివకుమార్,రమేష్ ,వంశి తదితరులు పాల్గొన్నారు.