ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు సిబ్బంది హాజరు రికార్డు పరిశీలించి సమయపాలన పాటించని కొందరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆసుపత్రిలోని విభాగాలను పరిశీలిస్తూ రోగులతో ముచ్చటించిన కలెక్టర్ వైద్య సిబ్బంది మెరుగైన సేవలందించేలా స్పష్టమైన సూచనలు ఇచ్చారు రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని ఆసుపత్రి సూపరిండెంట్‌ను ఆదేశించినారు.