ప్రభుత్వ పాఠశాలలో వందేమాతర గీతాలాపన
వందేమాతర గేయం యొక్క150 వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి మరియు గవర్నర్ లకు ఇచ్చిన ఆదేశాల మేరకు నేడు అన్ని ప్రభుత్వ,ప్రైవేటు కార్యాలయాలు,విద్యాసంస్థలకు ఇచ్చిన సూచనల మేరకు
స్టేషన్ ఘనపూర్ లోని ప్రభుత్వ బాలికల పాఠశాల యందు అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు కలిసి వందేమాతర గీతాలాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.అనంతరం ఆర్డీవో వెంకన్న
బాలికల పాఠశాలలోని వంట గదిని పరిశీలించారు.పాఠశాల గదిలలోకి వెళ్ళి విద్యార్థులతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకన్న, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ,ఎమ్మార్వో వెంకటేశ్వర్లు,ఎంపిడివో విజయశ్రీ, ఎంఈవో కొమురయ్య,ఎస్ఐ రమేష్,డిప్యూటీ తహశీల్దార్ సంధ్యారాణి మరియు అధికారులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.అలాగే శివునిపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో వందేమాతర గీతాలాపన చేసారు.ఈ కార్యక్రమంలో శివునిపల్లి మాజీ సర్పంచ్ బూర్ల విష్ణు,కొలనుపాక శరత్ కుమార్,ప్రధానోపాధ్యాయులు,ఉపాద్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.