
ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
ఇటీవల భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రభుత్వ ప్లిడర్ గా నియమితులైన రేగొండ మండల కేంద్రానికి చెందిన బొట్ల సుధాకర్ ను రేగొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పట్టెం కోటిలింగం ఆధ్వర్యంలో జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో ప్రభుత్వ ప్లిడర్ బొట్ల సుధాకర్ కు జర్నలిస్టులు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా పట్టెం కోటిలింగం మాట్లాడుతూ చిన్ననాటి నుండి ఎంతో క్రమశిక్షణతో ఉన్నత చదువులు చదివి బొట్ల సుధాకర్ జిల్లాస్థాయి పదవి చేపట్టారని అన్నారు. పేదరికంలో పుట్టినప్పటికీ చదువులో వెనుకడుగు వేయకుండా డాక్టరేట్ పట్టా తీసుకొని యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడని అన్నారు. యువత ప్రభుత్వ ప్లిడర్ బోట్ల సుధాకర్ ను ఆదర్శంగా తీసుకొని క్రమశిక్షణతో ఉన్నత చదువులు చదివి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు బండి సోమయ్య గౌడ్, అంబాల రవీందర్, బండి సమ్మన్న గౌడ్, రొంటాల శంకర్, నామాల రమేష్, బత్తుల వెంకన్న, సుంకరి శ్రీధర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.