
–సిపిఎం జిల్లా కార్యదర్శి గారికి సభ్యులు రాపర్తి రాజు
అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ కు సిపిఎం వినతి
జనగామ :బచ్చన్నపట మండలం చిన్నరాంచర్ల రెవెన్యూ సర్వే నెంబర్ 174 లో ప్రభుత్వ భూమి విస్తీర్ణం 8 ఎకరాల 23 గుంటల భూమిని స్టేటస్ కో ఆర్డర్ పేరుతో భూకబ్జాదారులు అక్రమంగా ఆక్రమించుకున్న భూమిని స్వాధీనం చేసుకోవాలని సిపిఎం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ రోహిత్ సింగ్ గారికి వినతి పత్రం అందజేశారు
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు మాట్లాడుతూ జిల్లాలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను ప్రభుత్వమే కాపాడాలని కోరారు బచ్చన్నపేట మండల కేంద్రానికి సమీపాన ఉన్న విలువైన ప్రభుత్వ భూమి చిన్న రాంచర్ల రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 174 లో 8 ఎకరాల 23 గుంటల భూమి ఉన్నదని ఇట్టి ప్రభుత్వ భూమిని కాపాడాలని ప్రభుత్వం దృష్టికి వినతిపత్రం ద్వారా తీసుకొచ్చినట్లు తెలిపారు ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ భూమి ప్రభుత్వానిది అని హెచ్చరిక బోర్డులు రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేశారని కానీ భూమిని మాత్రం స్వాధీనం చేసుకోకుండా భూకబ్జాదారులైన బచ్చన్నపేట జడ్పిటిసి జడ్పీ వైస్ చైర్మన్ భర్త గిరబోయిన అంజయ్య తన రాజకీయ పలుకుబడితో ఈ భూమిని ఆక్రమించుకొని సాగు చేస్తున్నారని ఇట్టి భూమి విషయంలో గత ప్రభుత్వం గిరబోయిన అంజయ్యకు భూమి అసైన్డ్ చేయలేదని గతంలో కొంతమంది పేద రైతులకు అసైన్డ్ చేయగా వారి నుండి ప్రభుత్వం ఫారం-1, ఫారం-2, స్వాధీనం చేసుకుందని
కానీ తప్పుడు పద్దతులలో గిరబోయిన అంజయ్య, మరియు ఇతరులు భూమిని ఆక్రమంచుకొని సాగు చేసుకుంటున్నారు
ఈ భూమి విషయంలో RDO కోర్టులో భూకబ్జాదారులు అసైన్డ్ పట్టా చేయాలని దరఖాస్తు చేసుకోగా వీరి దరఖాస్తులను రద్దు చేశారని,అదేవిధంగా ఈ భూమి ప్రభుత్వ భూమి అని RDO కోర్టు తేల్చిందని అన్నారు ఈ భూమికి సంబంధంలేని భూ కబ్జాదారులు తప్పుడు పద్ధతుల్లో స్టేటస్ కో ఆర్డర్ తెచ్చుకున్నారని కావున జెసి కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి ఈ భూమి సమస్యను తక్షణమే పరిష్కారం చేసి ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని భూకబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు భూక్య చందు నాయక్, బెల్లంకొండ వెంకటేష్, పార్టీ నాయకులు దూసరి నాగరాజు అజ్మీర సురేష్ నాయక్ తేజావత్ గణేష్ నాయక్, పర్వతం నరసింహులు పర్వతం యాదగిరి కడకంచి బాలరాజు తూర్పాటి యాదగిరి కడకంచి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు