శివునిపల్లిలో రెవెన్యూ శాఖ అధికారుల చర్యపై గ్రామ ప్రజల ప్రశంసలు E69NEWS స్టేషన్ ఘనపూర్ జూన్ 21: జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ డివిజన్ పరిధిలోని శివునిపల్లి గ్రామంలో అక్రమంగా ఆక్రమించబడిన ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.సర్వే నెంబర్ 46 లో ఉన్న సుమారు 34 ఎకరాల భూమిలో కొంతమేర రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలోకి వెళ్లిందని గుర్తించిన అధికారులు,తక్షణమే చర్యలు చేపట్టారు.స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) సతీష్ మరియు మండల సర్వేయర్ నరేష్ ఆధ్వర్యంలో,సంబంధిత భూమి పరిమితులను సరిచూసి ఆక్రమితభూమిని అధికారికంగా తిరిగి స్వాధీనం చేసుకున్నారు.రియాల్టర్లు నాటి ఉన్న కనీలను తొలగించి,భూమిని క్లీన్ చేసి అధికార పరిధిలోకి తీసుకురాగలిగారు.ఈ సమయంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడకు చేరుకొని అధికారుల పనిని అడ్డుకునే యత్నం చేసినప్పటికీ,ఆర్ఐ సతీష్ ధైర్యంగా వ్యవహరిస్తూ పనిని పూర్తి చేశారు.ఈ చర్యలపై శివునిపల్లి గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ..“ప్రభుత్వ భూమిని కాపాడిన రెవెన్యూ అధికారులకు ధన్యవాదాలు.ఇది అక్రమంగా భూములు ఆక్రమించుకునే వారికి గట్టి హెచ్చరికగా నిలుస్తుంది,అని పేర్కొన్నారు.ముఖ్యంగా ఆర్ఐ,సర్వేయర్,ఎమ్మార్వో, ఆర్డిఓకు కృతజ్ఞతలు తెలిపారు.