
Latest News on Damera Mandal
దామెర: మండలంలోని ముస్త్యలపల్లి గ్రామంలో ప్రభుత్వ భూములు అన్యకాంతం అవుతున్నాయని ,వాటిని రక్షించి హద్దులను ఏర్పాటు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో దామెర మండల తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిప్యూటీ తాహాసిల్దార్ కు వినతిపత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి మాట్లాడారు. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇంటి జాగాలు ఇవ్వమంటే, ప్రభుత్వము ఇవ్వడం లేదని, ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న పేదలను, స్థలాలు ఖాళీ చేయించడం కోసం చర్యలు తీసుకునే ప్రభుత్వము, ప్రభుత్వ భూములను కొంతమంది అక్రమంగా దారులు ఆక్రమించుకొని, పట్టాలు చేసుకుంటే, ఎందుకు స్పందించడం లేదని, గతంలో ఎస్సారెస్పీ కెనాల్ లో భూమి కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చిన, మళ్లీ అదే భూమిని పట్టా చేసుకొని, అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో వాటిని ఆక్రమించుకొని, లబ్ధి పొందుతున్న వారి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, నిరుపేదలు గుడిసెలు వేసుకుంటే అనేక భయభ్రాంతులకు గురి చేసే ప్రభుత్వము, భూములను ఆక్రమించుకుంటే, ఎందుకు స్పందించడం లేదని, ముస్తాల పల్లి, గ్రామంలో సర్వేనెంబర్ 218, 219 సర్వే నిర్వహించి ప్రభుత్వ భూములకు సరిహద్దులు ఏర్పాటు చేసి వాటిని రక్షించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దొగ్గేల తిరుపతి, ప్రజా సంఘాల నాయకులు, గోవిందు ప్రతాప్, దామెర రమేష్, గ్రామస్తులు గణేష్ గట్టయ్య, లతో పాటు మహిళలు పాల్గొన్నారు.