
badrachalam news local news telugu daily news e69news
ఐటీడీఏ ద్వారా ప్రవేశపెడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు అందే విధంగా సంబంధిత యూనిట్ అధికారులు కృషి చేయాలని ఐ టి డి ఏ ప్రాజెక్ట్ అధికారి ప్రతిక్ జైన్ అన్నారు. తన ఛాంబర్ లో నిర్వహించిన గిరిజన దర్బార్లో మారుమూల ప్రాంతాల నుంచి అర్జీలు సమర్పించడానికి వచ్చిన గిరిజనుల నుండి ఆయన అర్జీలు స్వీకరించి, తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందించడానికి ప్రతి యూనిట్ అధికారి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన అన్నారు. ఈరోజు ఎక్కువ శాతం గిరిజన దర్బార్లో వ్యక్తిగత సమస్యలు, భూ సమస్యలు, ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు ఆన్లైన్ చేయించుట కొరకు ,నిరుపేదలైన గిరిజనులకు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి స్వయం ఉపాధి పథకాల కొరకు, దీర్ఘకాలిక వ్యాధులపై వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక సహాయం అందించుట కొరకు, పై చదువులు చదవడానికి ఆర్థిక భృతి కల్పించుట కొరకు ,మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాల కొరకు గిరిజనులు దరఖాస్తులను సమర్పించారని ,గిరిజన దర్బార్ లో సమర్పించిన అర్జీలను ప్రత్యేకమైన రిజిస్టర్లో ఆన్లైన్ ద్వారా నమోదు చేసి ,అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు విడతల వారీగా సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఎస్ ఓ సురేష్ బాబు, డి టి ఆర్ వోఎఫ్ ఆర్ శ్రీనివాస్, డిఈ హరీష్ ,మేనేజర్ ఆదినారాయణ, నాగభూషణం. కృష్ణార్జునరావ్, మరియు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.