జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని చిన్న పెండ్యాల గ్రామం ఎస్సీ కాలనీలో హౌస్ నెంబర్ 36/C వద్ద కరెంట్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతూ ఉన్నాయి.ఇటీవల చోటు చేసుకున్న గాలి దుమారాల వల్ల ఇక్కడి విద్యుత్ స్తంభం కూలిపోయి తీగలు ఇంటిపై పడేలా ఉన్నాయి.ఈ పరిస్థితి కారణంగా స్థానికులకు గణనీయమైన ప్రాణహానీ ప్రమాదం నెలకొంది.ఇటువంటి పరిస్థితే కొనసాగితే చిన్నపిల్లలు,వృద్ధులు మరియు మహిళలు తీవ్రమైన ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.స్థానికులు ఈ సమస్యను విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు తెలియజేసినప్పటికీ ఇప్పటివరకు స్పందన లేదు.అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అందువల్ల సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు ఈ విషయాన్ని అత్యవసరంగా పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.