తెలంగాణలో వున్నా నర్సుల సమస్యలు పరిష్కరించాలి
Hyderabadఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి సిటీ సెంట్రల్ ఆఫీస్ లో తెలంగాణ ఆల్ నర్సెస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగినది. ఈ సమావేశం లో
1)సిపిఎస్ రద్దు చేయాలని
2)ప్రమోషన్స్& ట్రాన్స్ఫర్స్ నిర్ణీత సమయంలో జరపాలని.
3) హయ్యర్ ఎడ్యుకేషన్ కి శాలరీ తో కూడినటువంటి ఎడ్యుకేషనల్ లీవ్స్ ఇవ్వాలని
4) అన్ని విభాగాల్లో క్యాడర్ స్ట్రెంత్ పెంచాలని.. వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు ట్రెజరీ శాలరీస్ ఇవ్వాలని.
5) నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని.
6) నర్సింగ్ పీజీ విద్య కొరకై మరిన్ని నర్సింగ్ కాలేజీలకు అనుమతి ఇవ్వాలని..
7) రిస్కలవెంట్స్ లు మరియు ఇతర అలవెన్స్లను సకాలంలో అందివ్వాలని.
8) పీజీ నర్సింగ్ విద్య కొరకు మరికొన్ని పాత నర్సింగ్ కాలేజీలకు అనుమతి ఇవ్వాలని కోరడం జరిగింది.
9) నర్సింగ్ సిబ్బంది విధుల నిర్వహణ వద్ద కనీస వసతులను కల్పించాలని.
10) ప్రతి గవర్నమెంటు హాస్పిటల్ కి ఒక పోలీస్ అధికారి అవుట్ పోస్ట్ ను ఏర్పాటు చేయాలని.ఇంకా మరికొన్ని
ముఖ్యమైనటువంటి భవిష్యత్తు కార్యాచరణ కర్తవ్యాలను చర్చించడం జరిగినది.
ఇట్టి సమావేశానికిఆల్ నర్సస్ ఫెడరేషన్ కి రాష్ట్ర గౌరవాధ్యక్షులైనటువంటి భూపాల్ గారురాష్ట్ర అధ్యక్షులు భూలక్ష్మిరాష్ట్ర ప్రధాన కార్యదర్శి సువర్ణ లత గారురాష్ట్ర కోశాధికారి స్వరూప గారు.రాష్ట్ర సహాయ కార్యదర్శులు మరియు ఉపాధ్యక్షులులావణ్య.. జానకి ..నాగమణి.. ఎలిజబెత్ రాణి. పాల్గొన్నారు.అదేవిధంగా5..6..7.. జోన్ల అధ్యక్షులు సుజాత..నాగమణి.. త్రివేణి.మరియు వీరితోపాటుహైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు సత్యవతిసంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆంతోనమ్మనల్లగొండ జిల్లా అధ్యక్షులు సరితగద్వాల్ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి. తదితరులు పాల్గొన్నారు