జఫర్ఘడ్ మండలంలో ఎడతెరిపి లేని భారీ వర్షాలకు జఫర్ఘడ్ పెద్ద చెరువు భారీగా అలుగు పోస్తున్న నేపథ్యంలో జఫర్ఘడ్ దివిటిపల్లి మధ్య గల రోడ్ డౌన్ లో నుండి భారీగా నీరు పోతున్న సందర్బంగా ప్రయానికులు,వాహనదారులు అనేక ఇబ్బందు ఎదుర్కొన్నారు.ఈ విషయాన్ని తెలుసుకున్న జఫర్ఘడ్ ఎస్సై బి.శంకర్ నాయక్ తన బృందంతో సందర్శించి తన పర్యవేక్షణలో ప్రయానికులను సురక్షితంగా బయటికి దాటించారు.మరియు వరద ఉదృతి తీవ్రంగా ఉన్నందున చేపల వేటకు వచ్చిన వారిని ఎలాంటి ప్రమాదం జరుగ కుండా ముందస్తుగా హెచ్చరించి వెల్లగొట్టారు.