
మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి,,,,
మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి,,,,
నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ క్రింద భూములు కోల్పోతున్న రైతులకు 2013చట్ట ప్రకారం పరిహారం ఇవ్వాలని ఎఐకెఎస్ జాతీయ నాయకులు మాజీఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి గారు డిమాండ్ చేశారు. భూసంరక్షణ కమిటి ఆద్వర్యంలో ఎస్ ఆర్ గార్డన్ లో జి వెంకట్రామారెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సు కు ముఖ్యఅతిథి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రాజెక్ట్ క్రింద భూములు కోల్పోతున్న రైతులకు నోటిస్ లు ఇవ్వకుండానే దౌర్జన్యంగా పోలిస్ లను పెట్టి భూసేకరణ చేయడం సరైంది కాదన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజక వర్గం, సొంతజిల్లా వాసిఅయినందున రైతులు మాకు న్యాయం జరుగుతుందని ఆశగా ఉన్నారు.ప్రభుత్వం రైతుల కడుపుకొడ్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.రైతు ఓకసారి భూమి కోల్పోతే వారికుటుంబం దేనిపై ఆధారపడి బతకాలో అర్థం కాక దిక్కుతోచని పరిస్థితుల్లో కి నెట్టబడుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే రైతులతో చర్చించి భుమికి బదులు భూమి ఇవ్వాలి లేదా న్యాయమైన పరిహారం 2013చట్ట ప్రకారం బహిరంగ మార్కెట్ రేట్ కు మూడింతలు కలిపి ఇవ్వాలని డిమాండ్ చేసారు. రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం సేకరిస్తున్న భూములకు ఒకోప్రాంతంలో ఒక్కో రేటు ఇస్తుందన్నారు, హైద్రాబాద్ చుట్టూ త్రిబుల్ ఆర్ రోడ్డు విస్తరణలో ఎకరానికి కోటి రూపాయలు ఇవ్వడానికి ముందుకొచ్చింది కానీ మన దగ్గర వచ్చేకాడికి ఎంత ఇస్తే అంత తీసుకోవాలని బయపెట్టి తీసుకోవాలనిచూస్తుంది , రైతులు భయ పడాల్సిన అవసరం లేదన్నారు భూములు కోల్పోతున్న రైతాంగానికి ఎర్రజండా అండగా ఉంటుందన్నారు మీకు న్యాయం జరిగే వరకు మీ వెంట మీముంటామన్నారు.కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మహేష్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్,రైతుసంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య, మచ్చందర్, రాజు,కేశవ్ గౌడ్, నారాయణ, సాయికుమార్, నర్షిములు గౌడ్, లక్స్మికాంత్,అరుణ్,తదితరులు పాల్గొన్నారు.