
telugu galam news e69news local news daily news today news
– ఫలించిన ఎంపి మాలోత్ కవిత కృషి గళం న్యూస్ డోర్నకల్:- గత కొంతకాలంగా రద్దయిన కొల్లాపూర్ ఎక్స్ ప్రెస్ రాకపోకలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. గతంలో ఇదే సర్వీసు మణుగూరు నుండి నడిచేది, కానీ దానిని ఈసారి కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి మాత్రమే నడుపుతున్నారు. కర్నాటక రాష్ట్రంలోని బెల్గావి నుండి ప్రారంభమయ్యే ఈ రైలు సికింద్రాబాద్, కాజీపేట్ డోర్నకల్ మీదుగా భద్రాచలంరోడ్ రైల్వే స్టేషకు చేరుకుంది. ఇక్కడి నుండి డోర్నకల్, కాజీపేట సికింద్రాబాద్ మీదుగా తిరిగి బెల్గావి వెళుతుంది. ప్రతీ రోజూ సాయంత్రం 4.35 గం.లకు భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ బయలు దేరే ఈ రైలు మొత్తం 1092 కి.మీ మేరా ప్రయాణం చేస్తుంది.కొల్లాపూర్ రైలు పునరుద్ధరణకు ఎంపి మాలోత్ కవిత చేసిన కృషి ఫలించింది. కొంత కాలం వరకు కొల్లాపూర్ ఎక్స్ప్రెప్రెస్ నడిపిన రైల్వేశాఖ దానిని రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై జీనవరి 25వ తేదిన జిల్లా కలెక్టరేట్లో జరిగిన దిశ సమావేశంలో పలువురు ప్రజా ప్రతినిధులు సమస్యను లేవనత్తారు.దీనిపై స్పందించిన ఎంపి కవిత కేంద్రరైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్‌తో నేరుగా ఫోన్లో మాట్లాడటంతో పాటు తన లెటర్ హెడ్ పై సమస్యను వివరిస్తూ లేఖ రాశారు. స్పందించిన ఆయన సోమవారం నుండి కొల్లాపూర్ ఎక్సైప్రెస్ ను ప్రత్యేక రైలుగా నడిపేందుకు రైల్వేశాఖకు అనుమతులు జారీ చేయడంతో రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి. రైలు రాకపోకలకు కృషి చేసిన ఎంపి మాలోత్ కవితకు పలువురు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.