
పురుగుల అన్నం పెట్టిన రాళ్లన్నం పెట్టిన తినాల్సిందే,
మిట్ట గూడెం గురుకులం బాయ్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ స్వప్నకుమారి ని సస్పెండ్ చేయాలి
పురుగుల అన్నం పెట్టిన రాళ్లన్నం పెట్టిన తినాల్సిందే, లేదా టీసీలు ఇచ్చి పంపిస్తాము అని ప్రిన్సిపాల్ బెదిరింపులు
తినడానికి వచ్చారా చదవటానికి వచ్చారా అని ప్రిన్సిపాల్ వ్యవహారంపై కంప్లైంట్ చేసిన పట్టించుకోని ఆర్ సి ఓ రాజు
ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై ఫైనల్ ఇయర్ విద్యార్థులు దౌర్జన్యం చేస్తూ, ర్యాగింగ్ చేస్తూ పిల్లల్ని కొడుతూ ఉన్న సీనియర్స్‌కి సపోర్ట్ చేస్తున్న ప్రిన్సిపాల్
విద్యార్థులకు రావాల్సిన ఫ్రూట్స్,బిస్కెట్స్, ఎగ్స్, విద్యార్థులకు ఇవ్వకుండా మాయం చేస్తున్నా ప్రిన్సిపాల్
సమస్యలపై చర్చలు జరుగుతుంటే ఎన్సిసి టీచర్ సీనియర్ విద్యార్థులను రెచ్చగొట్టి జూనియర్ విద్యార్థులపై ఉసుగొలిపే ప్రయత్నం చేస్తున్న టీచర్
- పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి పృథ్వి , జిల్లా నాయకులు శివ ప్రశాంత్
విద్యార్థులకు భోజనం నాణ్యతతో పెట్టకుండా అన్నంలో పురుగులు వచ్చిన పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మిట్టగూడెం గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ స్వప్నకుమారి ని సస్పెండ్ చేయాలని పి డి యస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాంపాటి పృధ్వీ జిల్లా నాయకులు మునిగేలా శివ ప్రశాంత్ డిమాండ్ చేశారు.
గురువారం కళాశాల విద్యార్థులు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, కళాశాల ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయాలని పి డి యస్ యూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండు నెలలుగా విద్యార్థులకు సరైన భోజనం అందించకుండా విద్యార్థులకు రావాల్సిన సీజనల్ ఫ్రూట్స్,బిస్కెట్స్, ఎగ్స్, విద్యార్థులకు ఇవ్వకుండా మాయం చేస్తూ అడిగిన విద్యార్థులను కక్షపూరితంగా టార్గెట్ చేసి బెదిరింపులకు గురి చేయడం, కళాశాల సిబ్బందితో విద్యార్థులపై ఒత్తిడి చేపించి విద్యార్థులను టీసీలు ఇచ్ఛి ఇంటికి పంపించే విధంగా గిరిజన విద్యార్థుల పట్ల ప్రిన్సిపాల్ ఇంత కక్షపూరితంగా వ్యవహరించడం బాధాకరమని వారు అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ కళాశాలకు రెగ్యులర్ గా హాజరు కాకపోవడమే కాకుండా ఫుడ్ ఇంచార్జీ లను నియమించి వారి పని విధానంతో సరైన పరిశీలన లేకపోవడం వలన విద్యార్థులకు నాణ్యమైన ఫుడ్ అందకపోవడం వలన తీవ్రమైన ఎండల సమయంలో విద్యార్థులకు కడుపునొప్పి, విరోచనాలు కావడం వలన డిగ్రీ పరీక్షలు సరిగా రాయలేని పరిస్థితి ఏర్పడింద ని వారు అన్నారు.
ప్రిన్సిపాల్ మరియు స్టాప్
ప్రిన్సిపాల్ అడ్మినిస్ట్రేషన్ లేకపోవడంతో సీనియర్ విద్యార్థులు కొంతమంది జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ కు పాల్పడడం సీనియర్ విద్యార్థులకు ప్రిన్సిపాల్ మద్దతు పలుకుతూ వారిని ప్రోత్సహించడంతో విద్యార్థుల మధ్య రెండు బృందాలుగా ఏర్పడి కళాశాలలో ఘర్షణ వాతావరణం ఏర్పడే విధంగా ప్రిన్సిపాల్ వ్యవహార శైలి ఉందని వారు అన్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు ఈ కళాశాలపై పర్యవేక్షించి జరుగుతున్న పరిణామాల పట్ల పరిశీలన చేసి కళాశాల ప్రిన్సిపాల్ ను స్పెండ్ చేసి వివాదానికి పాల్పడుతున్న కొంతమంది అధ్యాపకులను సైతం కళాశాల నుండి మార్చి కళాశాలలో విద్యార్థులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే అక్కడ విలేకరులు గాని విద్యార్థి సంఘం నాయకులు గానీ చర్చలు జరిగే క్రమంలో భోజనం బాగోలేదని ప్రిన్సిపాల్ గారితో మాట్లాడే క్రమంలో ప్రిన్సిపాల్ కంటే అక్కడ ఉన్నటువంటి స్టాప్ పెత్తనం చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్టాప్ కి ఎటువంటి సంబంధం లేదు. జవాబు దారితనం వార్డెన్ ది, ప్రిన్సిపాల్ ది కానీ స్టాప్ కి ఏమిటి సంబంధం వారు టీచర్స్ ల వారి వ్యవహార శైలి లేదు రౌడీయిజం గూండాయిజం టైపు వ్యాక్స్ టైపు వ్యవహరిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు వారిని ఇక్కడి నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలని విద్యార్థులు విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు
జూనియర్ విద్యార్థులు భాద
ఈ కళాశాలలో మేము అడ్మిషన్ అయినప్పటి నుండి ఇక్కడ జరుగుతున్నటువంటి సీనియర్స్ నుండి కానీ భోజనానికి సంబంధించి కానీ సరిగ్గా లేదని మేము ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకువెళ్లిన ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు అలాగే ప్రిన్సిపాల్ గారు సీనియర్స్ పిలిచి వారితో మీటింగ్ ఏర్పాటు చేసిన సందర్భాలలో సీనియర్స్ మా మీద దౌర్జన్యం చేయడం ర్యాగింగ్ చేయడం మమ్మల్ని కొట్టడం చేస్తున్నారని జూనియర్స్ పలుమార్లు ప్రిన్సిపల్ గారికి ఉన్నటువంటి స్టాప్ కి చెప్పిన ప్రయోజనం లేకుండా పోతుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎన్సీసీ మాస్టర్ ఉన్నారో తను మా మీద పెత్తనం చేయటం మమ్మల్ని కొట్టడం ఏదైనా చెప్పినప్పుడు మేము వినని పక్షంలో విచక్షరక్షితంగా కోపంతో రగిలిపోతూ మా మీదికి రావడం చేస్తున్నారు ఇదంతా ప్రిన్సిపల్ గారికి తెలిసినప్పటికీ సీనియర్స్‌కి వత్తాసు పలుకుతూ స్టాప్ ని తన కంట్రోల్లో పెట్టుకొని తన చుట్టూ ఒక ముళ్ళ కంచ టైపు స్టాప్ ను పెట్టుకున్నారు మేము ఎవరికైనా చెప్పుకుందాం అన్నా కానీ మమ్మల్ని బయటకు వెళ్లలేని స్థితిలో ఉంచారు ఇక్కడ ఉండటం కంటే మాకు జైల్లో బెటర్ అని మా అందరి అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఆర్ సి ఓ గారు వచ్చినప్పుడు కూడా వారి దృష్టికి తీసుకెళ్లాం అయినా కానీ వారు ఏదో వచ్చం కాబట్టి టూత్ మంత్రంగా చూసి మేము చెప్పినటువంటి సమస్యను పట్టించుకోకుండా ప్రిన్సిపాల్ గారితో స్టాప్ తో కలిసి బయట ఫుడ్డు తీసుకొచ్చి బిర్యానీ తినేసి ఆర్సిఓ గారు వెళ్లిపోయారు మా పరిస్థితి ఏమిటో కూడా అర్థం కాని స్థితిలో గందరగోళంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్టాప్ ని అలాగే వంట మాస్టర్లని ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేసి కొత్త స్టాప్ ను మాకు అందించగలరని ఉన్నత అధికారులు స్పందించి మాకు సరైన న్యాయం చేయగలరని మేము ఆశిస్తున్నాము.