
హనుమకొండ (సుబేదారి): నగరంలోని ప్రైవేటు హాస్పటల్ వైద్యం పేరుతో చేస్తున్న వ్యాపారము (దందా)ను అరికట్టాలని కోరుతూ డివైఎఫ్ఐ, ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దోగ్గెల తిరుపతి, జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్ (అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం) ఐద్వా జిల్లా కార్యదర్శి ఎల్. దీప, జిల్లా అధ్యక్షులు ఆర్. జయశ్రీ మాట్లాడారు. ప్రైవేటు హాస్పిటల్స్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఓపి, టెస్టులు, స్కానింగ్, మెడిసిన్ ల పేరుతో వైద్యం కోసం వచ్చే పేషంట్ల నుంచి విపరీతమైన ఫీజులు వసూలు చేస్తున్నారు. 2011 మెడికల్ ఎస్టాబ్లేషన్ చట్టం ను ఏ హాస్పిటల్స్ పాటించడం లేదు. అవసరం లేకున్నా టెస్టులు స్కానింగ్లు చేస్తూ రోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఆస్పత్రిలో ఆపరేషన్ కోసం వచ్చే పేషెంట్లను అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు, హాస్పటల్లో తీసుకునే ఫీజుల వివరాలు నోటీసు బోర్డులో పొందపరచడం లేదు, అక్కడ ఉన్న ఫీజులు ఒకటైతే వసూలు చేసేది మరొకలా ఉంది. హాస్పటల్ భవనాలకు విచ్చలవిడిగా అనుమతలు ఇస్తూ ఫైర్ సేఫ్టీ, పార్కింగ్ స్థలాలు కూడా ఉండడం లేదు, గుర్తింపు లేకుండా ప్రైవేటు హాస్పిటల్ కొనసాగుతున్న వాటి మీద చర్యలు తీసుకోవడం లేదు, మెడిసిన్ పేరుతో మెడికల్ షాపులు అందినంత దోచుకుంటున్నాయి, ప్రైవేటు హాస్పటల్లో ఫీజులు నియంత్రణకై చట్టం చేయాలని ప్రభుత్వం పర్యవేక్షణ నిరంతరం ఉండాలని, ప్రభుత్వ హాస్పటలలో కనీస సౌకర్యాలు లేవని పర్మినెంట్ వైద్యుల నియామకం చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ, ఐద్వా సంఘాల జిల్లా నాయకులు మంద సుచందర్, మోతే సతీష్, ఏ.సంధ్య, వల్లెపు లక్ష్మణ్, ఓర్సు చిరంజీవి, వేలు సుమన్, చిలుక జంపన్న, కుర్ర హర్ష,
మాడరాజు రమాదేవి, ఉమా, శ్వేత, రాధ, స్వప్న, శ్రీలత, శ్రీమతా, విజయ, రాధిక పాల్గొన్నారు.