
nalgonda news
-కంచర్ల భూపాల్ రెడ్డి మాజీ శాసనసభ్యులు నల్గొండ గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు రెండవ ఫేజ్ నల్లగొండ నియోజకవర్గంలోని 1056 మంది దళిత లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ఇచ్చిన వారందరికీ గ్రౌండ్ ప్రక్రియ పూర్తి చేయాలని నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి దళిత బంధు సాధన కమిటీ కన్వీనర్ పాలడుగు నాగార్జున ప్రభుత్వాన్ని కోరారు. నల్లగొండ నియోజకవర్గ దళిత బంధు సాధన కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఒకరోజు దీక్షలు చేయడం జరిగింది. ఈ దీక్షలకు మద్దతుగా కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల కనుగుణంగా గ్రామసభలు వార్డు సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి డిసెంబర్ 7న లక్ష్మీ గార్డెన్ లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సభ నిర్వహించి ప్రతి ఒక్కరికి ప్రొసీడింగు అందజేయడం జరిగిందని అన్నారు. లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల చొప్పున నిధులను కూడా విడుదల చేయడం జరిగిందని అన్నారు. ఎన్నికల కోడ్ వలన నిలిచిపోయిన ప్రక్రియ వెంటనే ప్రభుత్వం నిధులను విడుదల చేసి గ్రౌండ్ పూర్తి చేసి నిరుపేద దళితులను ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం గత స్కీములను రద్దు చేయాలనుకోవడం సరైన పద్ధతి కాదని అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వాలకి ఉంటుందని అన్నారు. ప్రభుత్వం కుంటి సాకులతో పేదల పథకాలు రద్దు చేయడం మానుకోవాలని అన్నారు. దళిత బంధు గ్రౌండింగ్ పూర్తి అయ్యేవరకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎలాంటి పోరాటాల కైనా సిద్ధంగా ఉండాలని తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై నిలదీస్తానని అన్నారు. నల్లగొండ నియోజకవర్గంలో దళిత బంధు అమలు చేయనట్లయితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని మంత్రులు, ముఖ్యమంత్రి వద్దకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు. ఈ దీక్షల కార్యక్రమంలో దళిత బంధు సాధన కమిటీ నాయకులు బకరం శ్రీనివాస్ అద్దంకి రవీందర్ నాయకులు భువనగిరి దేవేందర్ బకరం వెంకన్న అభిమన్యు శ్రీనివాస్ కందుల లక్ష్మయ్య బడుపుల శంకర్ చింతా సైదులు కందుల రమేష్ శ్రీకర్ విమలమ్మ యాదమ్మ సర్పంచులు దళిత బంధు లబ్ధిదారులు పాల్గొన్నారు..