ప్రొ,, జయశంకర్ ,శ్రీకాంత్ చారిల త్యాగాలు వృధా కాలేదు.
Muluguతెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్, మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతా చారి ల త్యాగాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ సాధిస్తున్నారని కోదాడ శాసనసభ్యులు బొల్లంమల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం కోదాడ పట్టణంలో బస్టాండ్ ఎదురుగా ఏర్పాటు చేస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్, శ్రీకాంత్ చారి విగ్రహాల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. అపారమైన మేధాశక్తితో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దిశా -దశ నిర్దేశం చేసి జీవితాన్ని ఉద్యమానికి త్యాగం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. మలిదశ ఉద్యమంలో జీవితాన్ని అగ్నికి ఆహుతి చేసి ఉద్యమం ఎగిసిపడే విధంగా ప్రాణాపాలు చేసిన శ్రీకాంతా చారి త్యాగం సూర్యచంద్రులు ఉన్నంతవరకు చిరస్మరణీయంగా ఉంటుందన్నారు. వారి ఆకాంక్షలు నెరవేర్చేందుకు మనమందరం బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలన్నారు. విగ్రహాల ఏర్పాటుతో వారి జీవితం వారి త్యాగాలు భవిష్యత్ తరాలకు లో పదిలంగా ఉంటాయన్నారు. విగ్రహాల ఏర్పాటుకు పూనుకున్న కోదాడ నాయకులను ఆయన అభినందించారు. విగ్రహాలజయశంకర్ సార్ ఏర్పాటుకు తనవంతు సహకారం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింత కవితా రాధారెడ్డి, విశ్వకర్మ సంఘం కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు డాక్టర్ బ్రహ్మం, విశ్వకర్మ నాయకులు అనిల్, రేవూరి వెంకటాచారి, నరసింహ చారి, వీరభద్రా చారి, తిరుపతా చారి, సత్యనారాయణ, సత్యం, వీరాచారి, పుల్లా చారి, అనంత చారి, టౌన్ పార్టీ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు, టిఆర్ఎస్ నాయకులు వెంపటి మధు, సత్య బాబు, చల్ల ప్రకాష్, పట్టణ కౌన్సిలర్లు కోట మధు, మైస రమేష్, గుండెల సూర్యనారాయణ, కట్టబోయిన శ్రీనివాస్ యాదవ్, గంధం పాండు, పిట్టల భాగ్యమా, బత్తుల ఉపేందర్, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.